కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలైన చివరి రోజు వరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 6,000కు అటూఇటుగానే ఉండేది. అయితే అన్ లాక్ సడలింపులు అమలులోకి వచ్చిన రోజు నుంచి దేశంలో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 80,000కు పైగా కేసులు నమోదయ్యాయి.
Also Read : తెలంగాణలో కరోనా రికవరీ రికార్డ్
గతంలో పట్టణాల్లో మాత్రమే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం పల్లెల్లో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో 500 మంది జనాభా ఉన్న గ్రామంలో ఏకంగా 100 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురంలో ఒక వ్యక్తి దినకర్మ సహపంక్తి భోజనం 100 మందికి కరోనా సోకడానికి కారణమైంది,
దాదాపు 200 మంది సహపంక్తి భోజనాలు చేయగా సగం మందికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారు సైతం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో మిగిలిన వారు సైతం ఎక్కడ ఎవరి నుంచి వైరస్ సోకుతుందో అర్థం కాక ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఊరిలో మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఆ గ్రామంలోకి కొత్తవాళ్లు రాకుండా చర్యలు చేపట్టారు. చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి గడిచిన ఆరు నెలలుగా ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేస్తుండటం గమనార్హం.
Also Read : తెలంగాణ.. ఊపిరి పీల్చుకో..!