https://oktelugu.com/

కరివేపాకే కదా అని తీసిపారేస్తున్నారా ? అసలు దీనివలన ఎన్ని లాభాలున్నాయంటే ?

  మనం ప్రతి రోజూ చేసే వంటల్లో కరివేపాకును వాడుతూ ఉంటాము. ఆహార పదార్థాలకు రుచిని, వాసనను ఇవ్వడంతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కరివేపాకు అంటే అందరికీ చులకనే. కూరలో అది కనిపిస్తే చాలు తీసి పారేస్తూ ఉంటారు. కానీ కరివేపాకును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. Also Read […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 24, 2022 5:02 pm
    Follow us on

     

    మనం ప్రతి రోజూ చేసే వంటల్లో కరివేపాకును వాడుతూ ఉంటాము. ఆహార పదార్థాలకు రుచిని, వాసనను ఇవ్వడంతో పాటు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కరివేపాకు అంటే అందరికీ చులకనే. కూరలో అది కనిపిస్తే చాలు తీసి పారేస్తూ ఉంటారు. కానీ కరివేపాకును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.

    Also Read : ఆరోగ్యానికి ఐదు చిట్కాలు

    సాధారణంగా కరివేపాకు చెట్టు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు 4 నుండి 5 ఆకులను మనం తీసుకోవడం ద్వారా అవి మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

    కరివేపాకు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి కరివేపాకును తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగించడంతో పాటు, శరీర బరువును తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.

     

    మధుమేహంతో బాధపడేవారికి కరివేపాకు ఒక వరంగా చెప్పవచ్చు. అందులో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు మన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాకుండా కరివేపాకును నమిలి మింగడం వల్ల చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది.

    కరివేపాకు మన కంటి చూపుకు చాలా మంచిది. ఇందులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. కరివేపాకు ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కంటి సమస్యల నుండి దూరం కావడమే కాకుండా రేచీకటి వ్యాధిని నియంత్రిస్తుంది.

    కరివేపాకులో జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయి. అలాగే జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇందులో ఉండే సుగుణాలు జుట్టును రాలకుండా చేయడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరిగేలా ఉపయోగపడుతుంది.

    కరివేపాకు ఒక మంచి సౌందర్య సాధనం అని చెప్పవచ్చు. ఇది చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతాయి. చర్మంపై ఏర్పడే మచ్చలు, ముడతలు, చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో కరివేపాకు అమోఘంగా పని చేస్తుంది.

    మరి ఇంకేందుకు ఆలస్యం.. కూరలో కర్వేపాకును తీసెయ్యకుండా తినండి … ఆరోగ్యాన్ని పెంచుకోండి!

    Also Read : ఇలా చేస్తే దగ్గు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు