Joe Biden: నేను విమానం డోర్‌ పక్కన కూర్చోను.. అమెరికా అధ్యక్షుడి చమత్కారం

రెండు నెలల క్రితం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి కాలిఫోర్నియాకు బయల్దేరింది. విమానం 16 వేల అడుగుల ఎత్తుకు చేరగానే ఎడమ వైపున్న తలుపు ఊడిపోయింది.

Written By: Raj Shekar, Updated On : March 30, 2024 4:34 pm

Joe Biden

Follow us on

Joe Biden: నేన బోయింగ్‌ విమానం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ తలుపు వద్ద కూర్చోనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఇటీవల బోయింగ్‌ విమానాలు తరచూ ఇంజినీరింగ్, క్వాలిటీ సమస్యలు ఎదర్కొంటున్నాయి. దీంతో ఈ కంపెనీపై నియంత్రణ సంస్థల నిఘా పెరిగింది. నాణ్యత, భద్రత విషయంలో తనిఖీలు ఎక్కువ కావడంతో ఉత్పత్తి సైతం నిలిచిపోయింది. దీంతో డెలివరీలు ఆగిపోయాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టాక్‌షోలో చమత్కారం..
జో బైడెన్‌ ఇటీవల ఓ టాక్‌షోలో పాల్గొన్నారు. ‘‘ మీరు న్యూయార్క్‌ సిటీకి వెళ్లే ముందు మీ రవాణాశాఖ మంత్రి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ బోల్టులు బిగించారా’’ అని ప్రశ్నించగా దానికి బైడెన్‌ బదులు ఇస్తూ.. ‘‘నేను తలుపు పక్కన కూర్చోనుగా జస్ట్‌ జోక్‌ చేస్తున్నా.. అయితే ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడాదు’’ అని వ్యాఖ్యానించారు.

ఇటీవల తలుపు ఊడిపోవడంతో..
రెండు నెలల క్రితం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి కాలిఫోర్నియాకు బయల్దేరింది. విమానం 16 వేల అడుగుల ఎత్తుకు చేరగానే ఎడమ వైపున్న తలుపు ఊడిపోయింది. దీంతో విమానాన్ని వెంటనే ఎమర్జెన్సీ లాండింగ్‌ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఇలాంటి ఇంజినీరింగ్, క్వాలిటీ సమస్యలు అనేకం వెలుగుచూశాయి. దీంతో బోయింగ్‌ విమానాలపై ఏకంగా అమెరికా అధ్యక్షుడే ఇలా జోక్‌ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.