US National Debt 2025: ప్రపంచ పెద్దన్నగా చెలామని అవుతున్న అమెరికా.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆదేశం అప్పులు పెరుగుతున్నాయి. ఇటీవల ఎలాన్ మస్క్ కూడా అదే విషయం చెప్పారు. పదేళ్లలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నారు. ఈ తరుణంలో అప్పులు తీర్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ యుద్ధాలను ప్రోత్సహిస్తున్నారు.
అమెరికా అప్పుల స్థితి
2025 నాటికి అమెరికా జాతీయ రుణం సుమారు 33 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని అంచనా. ఇది చిన్న దేశాల జీడీపీల మొత్తంతో పోల్చదగిన స్థాయిలో ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ యుద్ధాలు, రక్షణ ఖర్చులు, ఇతర ఖర్చుల కారణంగా ఈ అప్పుల భారాన్ని ఎదుర్కొంటోంది. ఈ రుణం ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడి తెస్తోంది.
Also Read: US Student visa : తెలుగు విద్యార్థులపై వీసా రద్దు గండం
వంద చిన్న దేశాలతో సమానం..
అమెరికా అప్పులు చిన్నవేం కాదు.. చిన్న దేశాల వార్షిక జీడీపీతో సమానం. ఇంత భారీ అప్పులు తీర్చడం ప్రస్తుతం అమెరికాకు తలకు మించిన భారంగా మారింది. వాటిని ఎలా తీర్చాలో తెలియని పరిస్థితి. వడ్డీలకే వేల డాలర్లు చెల్లిస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్ సూపర్ బడ్జెట్ ప్రతిపాదన చేశారు. కానీ, దానిపై వ్యతిరేకత పెరుగుతోంది. డోజŒ నుంచి ఎలాన్ మస్క్ బయటకు వచ్చారు. దీంతో అమెరికా ఇప్పుడు ఇతర దేశాల ఇంధనంపై కన్నేసింది.
చమురు కోసం ఇరాన్‌పై యుద్ధం..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు అమెరికా మద్దతు ఇస్తోంది. తాజాగా అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఇరాన్‌ను అణ్వస్త్ర రహితంగా మార్చేందుకు యుద్ధం చేస్తున్నామని ప్రకటించాయి. కానీ, ఈ యుద్ధం వెనుక అమెరికా చమురు లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులలో ఒకటి. ఈ చమురు వనరులపై నియంత్రణ సాధించడం భౌగోళిక రాజకీయ వ్యూహాలలో కీలకంగా పరిగణించబడుతుంది.