Railway Ticket Booking Notice: ప్రతిరోజు ట్రైన్ జర్నీ చేసేవాళ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. మిగతా వాహనాల కంటే ట్రైన్లో ప్రయాణం చేయడం వల్ల తక్కువ ధరతో పాటు.. సౌకర్యంగా ఉంటుంది. అయితే రైల్వే బోర్డు ఆధ్వర్యంలో నడిచే రైళ్లు కొన్ని నిబంధనలతో సాగుతూ ఉంటాయి. ప్రయాణికులకు అనుగుణంగా.. సమస్యలు పరిష్కరించే విధంగా ఈ నిబంధనలు మారుతూ ఉంటాయి. తాజాగా జూలై 1 నుంచి రైల్వే నిబంధనలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా టికెట్ బుక్ చేసుకునే వారికి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. మరి ఆ నిబంధనలు ఏవో ఇప్పుడు చూద్దాం..
ట్రైన్ జర్నీ చేయాలనుకునే వారు ఎక్కువ శాతం రిజర్వేషన్ టికెట్ను బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి అనుకోని పరిస్థితుల్లో సడన్లిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో తాత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ట్రైన్ టికెట్ గురించి చాలామందికి అవగాహన ఉంటుంది. మొబైల్ లోనే IRTC ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చు. అయితే జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ లో కొన్ని మార్పులు రానున్నాయి. ఇప్పటివరకు కొన్ని వివరాలతో IRTC వెబ్సైట్ ద్వారా టికెట్ బుక్ చేసుకుని అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేవారు తప్పనిసరిగా తమ ఆధార్ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబరు లేకపోతే తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండదు.
Also Read: Railway : రైల్వేలో ఈ టికెట్ పై ప్రయాణం చేస్తున్నారా? మందు ఇది తెలుసుకోండి..
అలాగే జూలై 15 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్లో మరో మార్పు రానుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తనతో పాటు తన కుటుంబ సభ్యుల టికెట్ కూడా బుక్ చేసుకోవాల్సి వస్తే.. వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ను తప్పనిసరిగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. గతంలో ఒకరివి మాత్రమే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు ఎంతమంది టికెట్ పొందుతున్నారో.. అందరి ఆధార్ కార్డు నెంబర్లు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డుకు లింకు అయి ఉన్న మొబైల్ కు ఓటిపి వస్తుంది. ఈ ఓటిపి చెబితేనే టికెట్ బుక్ అవుతుంది. ఇలా ఎంతమంది టికెట్ బుక్ చేసుకున్నా.. వారందరూ తమకు మొబైల్ ఉంటే ఓటీపీ తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. మొబైల్ లోనే కాకుండా ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేసుకున్నా.. ఇవే నిబంధనలు ఉంటాయి. అందువల్ల టికెట్ బుక్ చేసుకునేవారు ఆధార్ నెంబర్ తో పాటు.. ఓటిపి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
రైల్వే టికెట్ బుకింగ్ లో భాగంగా తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారు ప్రయాణికులకు ఓ సదుపాయాన్ని జులై 15 నుంచి కల్పించనున్నారు. అదేంటంటే సొంతంగా టికెట్ బుక్ చేసుకునే వారికి.. ఏజెన్సీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి 30 నిమిషాల సమయాన్ని తేడా ఉంచారు.. అంటే ప్రయాణికుడు సొంతంగా తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే వెంటనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కానీ ఏజెన్సీ వారు టికెట్ బుక్ చేయాలని అనుకుంటే స్లాట్ ఓపెన్ అయినా 30 నిమిషాల తర్వాత మాత్రమే అవకాశం ఉంటుంది. అందువల్ల తత్కాల్ టికెట్ సొంతంగా టికెట్ బుక్ చేసుకోవాలని అనుకునే వారికి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు.