spot_img
Homeఅంతర్జాతీయంUS Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. ఆయన ఇప్పటికీ అమెరికాకు తలగుడం లేదు. మరోవైపు అమెరికా ఈ యుద్ధం కోసం భారీగా ఖర్చు చేసి అప్పుల పాలవుతోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఇప్పటి వరకు 37.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 3.60 లక్షల కోట్లు) ఖర్చు చేసింది. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీ ముందు తొలిసారి హాజరై ఈ వివరాలను వెల్లడించారు.

ప్రజాధనంతో యుద్ధం..
యుద్ధం కోసం అమెరికా ఖర్చు చేసిన సొమ్మంతా పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి వచ్చినది. ఆధునిక యుద్ధాలలో ఆయుధాలు, సాంకేతిక వ్యవస్థలు, సైనిక రవాణా, లాజిస్టిక్స్ వంటి అంశాల వల్ల ఖర్చులు వేగంగా పెరుగుతాయి. 37.5 బిలియన్ డాలర్లు అనేది అమెరికా వార్షిక రక్షణ బడ్జెట్‌లో గణనీయమైన భాగం.

అదనపు నిధుల అభ్యర్థన..
ఇటీవల స్విజర్లాండ్లో అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఇరా శాంతి ఒప్పందం ప్రకారం నడుచుకోవడం లేదని అమెరికా మళ్లీ దాడులు మొదలుపెట్టింది. ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా అనుకూల గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తుంది. దీంతో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. నేపథ్యంలో అమెరికా యుద్ధానికి కావాల్సిన నిధుల కోసం మళ్లీ వేట ప్రారంభించింది. అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ ఇప్పటివరకు చేసిన ఖర్చును సమర్థించుకుంటూ, యుద్ధ కార్యకలాపాలను కొనసాగించడానికి మరో 67 బిలియన్ డాలర్లు విడుదల చేయాలని కోరారు.

మరింత కాలం యుద్ధం..
అదనపు నిధుల అభ్యర్థన యుద్ధం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం లేదా మరింత తీవ్రంగా కొనసాగుతోందని చెబుతుంది. సాధారణంగా యుద్ధాలలో ఖర్చులు అంచనా కంటే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నిధులు మంజూరు చేయడం రాజకీయ చర్చలకు దారితీస్తుంది. అమెరికా బడ్జెట్‌పై ఒత్తిడి
ఈ స్థాయి ఖర్చు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫెడరల్ బడ్జెట్ లోటు పెరిగే అవకాశం ఉంది. ఇతర దేశీయ కార్యక్రమాలు (ఆరోగ్యం, విద్య, అవస్థాపన)కు నిధులు తగ్గే అవకాశం ఉంది.
దీర్ఘకాలికంగా రాష్ట్ర రుణం పెరగడం వల్ల భవిష్యత్ తరాలపై భారం పడుతుంది. అమెరికా వంటి ఆర్థిక శక్తి కూడా ఇలాంటి ఖర్చులను నిర్వహించడం సులభం కాదు.

రాజకీయ, వ్యూహాత్మక ఎత్తుగడ..
హెగ్సెత్ సెనేట్ కమిటీ ముందు హాజరైన తొలి సందర్భంలోనే ఈ వివరాలు వెల్లడి చేయడం రాజకీయంగా ముఖ్యం. కాంగ్రెస్ సభ్యులు యుద్ధం ఫలితాలు, లక్ష్యాలు, ఖర్చు-లాభాలను ప్రశ్నించే అవకాశం ఉంది. యుద్ధాలు సాధారణంగా ప్రజాభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేస్తాయి.. అమెరికా విదేశాంగ విధానంలో మధ్యప్రాచ్యం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో కూడా ఇది చూపిస్తుంది.

అమెరికా ఇప్పటికే 3.60 లక్షల కోట్లు ఖర్చు చేసి, మరో 67 బిలియన్ డాలర్లు (సుమారు 5.5 లక్షల కోట్లు) కోరడం యుద్ధం ఇంకా ముగియలేదని, మరింత ఆర్థిక మద్దతు అవసరమని స్పష్టం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం యుద్ధ లక్ష్యాలను స్పష్టంగా నిర్వచించి, ఖర్చులను నియంత్రించడం చాలా ముఖ్యం. ఈ ఖర్చు వెనుక ఉన్న వ్యూహాత్మక అవసరాలు ఏమిటి, ఫలితాలు ఎలా ఉంటాయనేది రాబోయే రోజుల్లో మరింత స్పష్టమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version