Pakistan : భారత్‌లో అశాంతి, అల్లర్లకు కుట్రలు కుతంత్రాలు చేస్తోంది దాయాది దేశం పాకిస్తాన్. ఇందు కోసం మన పొరుగున ఉన్న చైనా, అగ్రరాజ్యం అమెరికాతో సన్నిహితంగా మెలుగుతోంది. భారత్‌పై తప్పడు ఆరోపణలు చేస్తూ విశ్వ వేదికపై తప్పుగా చూపే ప్రయత్నం చేస్తోంది. భారత్‌లోకి అక్రమంగా ఉగ్రవాదులను పంపిస్తోంది. కశ్మీర్‌లో తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇలాంటి దేశంతో భారత్ ఎప్పుడో తెగదెంపులు చేసుకుంది. తాజాగా అమెరికా కూడా పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చింది. పాక్ కు చెందిన నాలుగు మిసైల్స్ సంస్థలపై ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ క్రిపణులపై కీలక వ్యాఖ్యలు చేసింది. దీర్ఘశ్రేణి క్షిపణుల తయారీ అమెరికాకు కూడా ముప్పు అని పేర్కొంది.
నాలుగు సంస్థలపై బ్యాన్..
పాకిస్తాన్ తయారు చేస్తున్న నాలుగు దీర్ఘశ్రేణి క్షిపణిలు తయారు చేస్తోంది. ఇందుకు సహకారం అందిస్తున్న నాలుగు సంస్థలను అమెరికా గుర్తించింది. వీటిపై ఆంక్షలు విధించింది. తాజాగా ఆంక్షల విషయంలో అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజరీ జోన్ ఫైనర్ స్పందించారు. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు అభివృద్ధి చేయడం అమెరికా సహా దక్షిణాసియా దేశాలకు పెద్ద ముప్పు అని పేర్కొన్నారు. అందుకే ఆ దేశానికి చెందిన నాలుగు సంస్థలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. 2021లో ఆఫ్ఘాన్ నుంచి అమెరికా దళాలు వైదొలిగిన తర్వాత పాకిస్తాన్‌తో ఒకప్పటి సంబంధాలు లేవని వెల్లడించారు.
ఆ నాలుగు సంస్థలు ఇవే..
అమెరికా ఆంక్షలు విధించిన నాలుగు సంస్థల్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్(ఎన్డీసీ) కూడా ఉంది. దీంతోపాటు అక్తర్ సన్స్ ప్రైవేటు లిమిటెడ్, అఫిలియేట్స్ ఇంటర్నేషనల్, రాక్సైడ్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలు ఉన్నాయి. ఈ మూడు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్నాయి.