Winter Tips : చలికాలం వచ్చేసింది. ప్రస్తుతం అన్ని చోట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. బయట వాతావరణంలోనే కాకుండా ఇంట్లో ఉన్నా కూడా చలి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ అయ్యాయి. ఏ సమయంలో బయటకు వెళ్లిన కూడా చల్లని గాలులు వీస్తాయి. చలి వల్ల చాలా మందికి జలుబు, దగ్గు వంటివి వస్తాయి. దీనికి తోడు ఇంట్లో కూడా చల్లగా ఉండే ఈ సమస్య పెరుగుతుంది. దీంతో కనీసం చల్లని నీటిని ముట్టుకోలేరు. ఈ సమయంలో చాలా మంది గీజర్ వాడుతుంటారు. చలికాలంలో చల్లని నీరు స్నానం చేస్తే జలుబు, దగ్గుతో పాటు జ్వరం కూడా వస్తుంది. ఎన్ని రోజులు అయిన కూడా ఈ సమస్య తగ్గదు. అలా అని చాలా మంది వేడి నీరు కోసం గీజర్ వాడుతారు. పూర్వం రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద వేడి నీరు పెట్టుకుని స్నానం చేసేవారు. కానీ ఇప్పుడు వేడి నీరు కోసం ఎన్నో కొత్త పద్ధతులు వచ్చాయి. ఇవి మనిషికి సుఖాన్ని అందజేసిన కూడా కొన్ని సార్లు ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అయితే కొందరికి తెలియక గీజర్ వాడేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. దీంతో మనిషి ప్రాణాలు కూడా కోల్పోతున్నాడు. మరి గీజర్ వాడే సమయంలో చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కొందరు గీజర్ పెట్టేటప్పుడు స్విచ్ వేసిన తర్వాత వాడుతుంటారు. ఇలా అసలు చేయకూడదు. ఎందుకంటే స్విచ్ వేసిన తర్వాత గీజర్ వాడటం వల్ల కొన్నిసార్లు కరెంట్ షాక్ కొడుతుంది. దీంతో మీరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గీజర్ ఆన్ చేసి బకెట్ నీరు ఫుల్‌గా నింపుకున్న తర్వాత మాత్రమే మీరు వాడాలి. ముఖ్యంగా పిల్లలను అయితే దీని దరిదాపుల్లోకి తీసుకెళ్లవద్దు. ఎక్కువగా వేడి కావాలని గీజర్‌ను ఎక్కువ సమయం ఆన్‌లో ఉంచవద్దు. దీనివల్ల కొన్నిసార్లు గీజర్ పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కొంత లిమిట్ సమయం మాత్రమే గీజర్‌ను పెట్టండి. మీరు వేడి నీరు అవసరం తీరిపోయిన తర్వాత గీజర్ ఆపేయండి. ఒక 20 నిమిషాలకు నీరు వేడి అయితే ఆపేయండి. రోజంతా అది ఆన్‌లో ఉండే పేలిపోయే ప్రమాదం ఉంది. అలాగే బ్రాండెడ్ గీజర్‌లను మాత్రమే వాడండి. తక్కువ రేటు ఉన్నవి వాడటం వల్ల అవి తొందరగా పాడవడంతో పాటు ఒక్కసారిగా పేలిపోతాయి. గీజర్లు ఉన్న దగ్గర వెలుతురు ఉండేలా చూసుకోండి. దీనికి గాలి లేకపోయిన కూడా పేలిపోతాయి.
గీజర్ నుంచి కొన్ని హానికర రసాయనాలు విడుదల అవుతాయి. కాబట్టి గీజర్ ఉన్న దగ్గర తప్పకుండా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. అలాగే కనీసం ఏడాదికి ఒకసారి గీజర్‌ను సర్వీస్ చేయించాలి. కొందరు చలికాలంలో వాడుతారు. మళ్లీ వేసవిలో వాడకుండా ఉంచేస్తారు. అలా మళ్లీ చలికాలం వస్తే కనీసం సర్వీస్ చేయించకుండానే వాడుతుంటారు. దీనివల్ల మీకు ప్రమాదం ఏర్పడుతుంది. గీజర్ నీరు వేడిగా ఉంటాయి. వీటిని బాడీ మీద వేసుకోవడం మంచిది కాదు. కానీ సుఖాలను అలవాటు పడి చాలా మంది గీజర్‌ను ఉపయోగిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.