Pillows : ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ఆహారం పట్ల, వాతావరణం పట్ల, కాలాల పట్ల, నీరు విషయంలో ఇలా చాలా విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. ఇక పడక గది విషయంలో కూడా జాగ్రత్త అవసరం గురూ. మరి ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఏ సమస్యలు వస్తాయి? ఎందుకు తీసుకోవాలి అనే వివరాలు ఈ ఆర్టికల్ లో చూసేద్దాం.
ఆరోగ్యం విషయంలో పడక గది చాలా పాత్ర పోషిస్తుంది. నిత్యం ఉపయోగించే బెడ్, దిండు, బెడ్ షీట్లు నీట్ గా ఉంచుకోవాలి. వీటి విషయంలో జాగ్రత్త చాలా అవసరం. నీట్, జాగ్రత్త ఎంత ముఖ్యమూ కంఫర్ట్ కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. అందుకే వీటిని నిత్యం మార్చడం చాలా అవసరం. దిండ్లు కొన్ని రోజల్లోనే వాటి ఆకారాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. పడుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని గట్టిగా ఉంటే మరికొన్ని మెత్తగా ఉంటాయి. మీ కంఫర్ట్ ను బట్టి వీటిని మార్చుకోండి. అంతేకాదు కంఫర్ట్ ఉన్నా కూడా వీటిని మారుస్తూ ఉండాలి.
చర్మ వ్యాధులు: పాత దిండుల్లో దుమ్ము, మైట్స్, ఆయిల్, మృత చర్మ కణాలు ఉంటాయి అంటున్నారు డెర్మటాలజిస్టులు. ఇవి అలర్జీ, చర్మ సంబంధ వ్యాధులను పెంచుతాయి. కొన్ని సార్లు గజ్జి తామర వంటి సమస్యలను కూడా పెంచే అవకాశం ఉంది. అందుకే ప్రతి రోజూ ఉపయోగించే దిండును మార్చాలి. దిండు సరైన షేప్లో ఉండాలి. లేదంటే కూడా సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు. వెన్నెముక, మెడ వంటి ప్రాంతాల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. వీటి అలైన్మెంట్లో తేడాలు వచ్చి తలనొప్పి, దీర్ఘకాలిక మెడ నొప్పి, బాడీ పోస్టర్లోనూ మార్పులు వస్తాయి కాబట్టి జాగ్రత్త చాలా అవసరం.
ఎప్పుడు మార్చాలి? దిండును ఆరు నెలలకు ఒకసారి అయినా కచ్చితంగా మార్చాలి. చివరకు సంవత్సరం తర్వాత అయినా మార్చడం చాలా అవసరం. ఇక రెండు సంవత్సరాలు దాటిన దిండులను మాత్రం అసలు వాడకూడదు. లేదంటే ఎక్కువ చర్మ సమస్యల బారిన పడాల్సి వస్తుంది. దీని కంటే ముందే దిండు గట్టి పడినా, ఫ్లాట్గా అయినా లేదా రంగు మారినా కూడా వాటిని మార్చడం అవసరమే.
రీ యూస్:
దిండ్లు, పరుపులు వంటివి మార్చినప్పుడు వాటిని చెత్తలో పడేయకండి. వీటిని ఉపయోగకరంగా వాడుకోవచ్చు. అంటే ఆశ్రమాలు లేదా జంతుశాలలకు ఇవ్వడం వల్ల ఒకరికి సహాయం చేసిన వారు అవుతారు. పర్యావరణ పరంగానూ ఎంతో మేలు జరుగుతుంది. సింథటిక్స్తో తయారు చేసిన దిండులను రీసైకిల్ చేయవచ్చు కూడా. దీని కోసం కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇక కాటన్ లేదా ఇతర ఆర్గానిక్ పదార్థాలతో తయారైనవి అయితే ఎలాంటి సమస్య లేకుండా డి కంపోజ్ అవుతాయి. సో పెద్దగా ప్రాబ్లం ఉండదు.