US Housing Market: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సంఘలతో అమెరికాలో ధరలు భారీగా పెరిగాయి. నిరాంతో యుద్ధం కారణంగా ట్రంపు పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికా హౌసింగ్ మార్కెట్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. గత దశాబ్దాల్లో కనిపించని డిమాండ్ క్షీణత ప్రస్తుతం నెలకొంది. 6 లక్షలకు పైగా ఇళ్లు అమ్మకానికి ఉన్నాయి. ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకిన తర్వాత, రుణ వడ్డీ రేట్లు ఎగసినప్పుడు కొనుగోళ్లు కరువయ్యారు. అమ్మేవారు ధరల ఒత్తిడికి గురవుతున్నారు.
ధరల బూమ్ నుంచి పతనానికి..
2020-2022 మధ్య పాండమిక్‌తో ఇళ్ల ధరలు దేశవ్యాప్తంగా 40% పెరిగాయి. ,మియామీలో మీడియన్ ఇళ్ల ధరలు రెట్టింపు అయ్యాయి.. కానీ 2022 నుంచి ఫెడరల్ రిజర్వ్ రేట్లు 5.5%కు ఎత్తడంతో 30-సంవత్సర మార్ట్‌గేజ్ రేట్లు 7.5%కు చేరాయి. ఫలితంగా నెలవారీ ఈ ఎం లు భారీగా పెరిగాయి. ఫలితంగా కొనుగోలు 25 శాతం పడిపోయాయి. ఫ్లోరిడా, టెక్సాస్, ఫెనిక్స్ వంటి ‘హాట్ స్పాట్లు’లో డిమాండ్ 40 శాతం క్షీణించింది.
ఇన్వెంటరీ పెరుగుదల..
ఇప్పుడు అమ్మకానికి 6.2 లక్షల ఇళ్లు ఉన్నాయి. 2008 క్రైసిస్ తర్వాత ఇదే అత్యధికం. సాధారణ 3-4 నెలల సప్లై అవసరం, కానీ ఇప్పుడు 9 నెలలు. అమ్మేవారు ‘లాక్-ఇన్ ఎఫెక్ట్’తో ఇబ్బంది పడుతున్నారు.
ఆర్థిక ప్రభావాలు..
ఈ క్రైసిస్ స్థానిక ఆర్థిక వ్యవస్థలను తాకుతోంది. రియల్టార్ల ఆదాయం 20 శాతం పడిపోయింది. యంగ్ జనరేషన్ రెంట్‌కి మారుతోంది. అధిక ధరలు, వడ్డీ పెరుగుదల మార్కెట్‌ను అస్థిరపరుస్తాయి. ఫెడ్ రేట్లు 2026 చివరిలో 4 శాతం తగ్గితే రికవరీ రావచ్చు, కానీ ఇన్వెంటరీ అదుపులో లేకపోతే 2008 నాటి పరిస్థితి రిపీట్ అవుతుంది.
అమెరికాలో పడిపోయిన ఇళ్ల ధరలతో ఇల్లు అమ్ముకునేవారు తక్కువ ధరకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. రియల్ ఎస్టేట్ రంగం పతన దిశలో పయనిస్తుంది.