Producer Nagavamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటి ముందుకు దూసుకెళ్తుంది. సినిమా థియేటర్ల విషయంలో ఇప్పటికి చాలావరకు గొడవలైతే జరుగుతూనే ఉన్నాయి. మల్టీప్లెక్స్ రావడంతో సింగిల్ స్క్రీన్స్ ని పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. ఇక దానికి తోడుగా సింగిల్ స్క్రీన్స్ కి రెంటేడ్ పర్పస్ లో డబ్బులు చెల్లించడం వల్ల ఎగ్జిబ్యూటర్లు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల వాళ్లకు వచ్చే లాభాలేమీ లేవని థియేటర్ మెయింటినెన్స్ కే విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయంటూ వాళ్ళు వాపోతున్నారు. మల్టీప్లెక్స్ లకు పర్సంటేజ్ రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారు. సింగిల్ స్క్రీన్స్ కి మాత్రం రెంటేడ్ పర్పస్ లో చెల్లించడంతో వల్ల వాళ్లు తీవ్రమైన నష్టాన్ని చవిచూస్తున్నామంటూ గత కొన్ని రోజులుగా కామెంట్లయితే చేస్తున్నారు.
దాంతో థియేటర్ ఎగ్జిబ్యూటర్లు అందరు కలిసి మే 30వ తేదీ నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసి వేయాలని కామెంట్లు చేస్తున్నారు. ఇక దానికి తోడుగా ప్రొడ్యూసర్లందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇక ఆ ప్రెస్ మీట్ లో నాగ వంశీ మాట్లాడుతూ ఎక్కడ చిన్న కాళీ ప్రదేశం దొరికిన కూడా మల్టీ ఫ్లెక్స్ లు కట్టే ఒక ప్రొడ్యూసర్ సింగిల్ స్క్రీన్స్ గురించి మాట్లాడటం చాలా హాస్యస్పదంగా ఉందన్నాడు.
ఇక అలాంటి వ్యక్తి కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే చేసేది ఏముంది అంటూ అతని మీద వ్యంగ్యంగా కామెంట్లు చేశాడు. ప్రస్తుతం నాగావంశీ చేసిన కామెంట్స్ ని బట్టి చూస్తే ఆయన ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన సునీల్ నారంగ్ ను ఉద్దేశించే కామెంట్స్ చేస్తున్నారు అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు…ఇక దీని మీద సునీల్ నారంగ్ కానీ ఇంకా వేరే ప్రొడ్యూసర్స్ గానీ ఎవరు ఎలాంటి స్పందనను తెలియజేయలేదు…
మొత్తానికైతే సింగిల్ స్క్రీన్స్ ను మూసి వేస్తే సినిమాలు ఆడటం కష్టమవుతుంది… కాబట్టి దీనిమీద సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇప్పటికే సినిమా థియేటర్ కి జనాలు రావడం తగ్గించారు. కాబట్టి సింగిల్ స్క్రీన్స్ ను కూడా మూసి వేస్తే సినిమాలను పట్టించుకునే వాళ్ల సంఖ్య మరింత తగ్గిపోతుంది. ఇక చిన్న సినిమాలకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది…