Homeఅంతర్జాతీయంDonald Trump: అమెరికన్ డాలర్ పై ట్రంప్ పైత్యం.. ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు

Donald Trump: అమెరికన్ డాలర్ పై ట్రంప్ పైత్యం.. ఏం చేస్తున్నాడో తెలిస్తే అవాక్కవుతారు

Donald Trump: పిచ్చి ముదిరింది.. నెత్తికి రోకలి చుట్టండి అన్నాడట వెనుకటికి ఒకడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి కూడా అలానే ఉంది.. గిట్టని దేశాల మధ్య యుద్ధాలు.. నచ్చని దేశాల మధ్య సుంకాలు.. ఎదుగుతున్న దేశాల మీద పైత్యాలు.. ఇలానే ఉంటుంది అమెరికా పరిస్థితి. అగ్ర రాజ్యం గా ఉన్నప్పటికీ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద పెత్తనం సాగిస్తున్నప్పటికీ.. అమెరికా తన దుర్మార్గమైన విధానాలను మానుకోదు. తన సామ్రాజ్యవాద పెత్తనాన్ని వదులుకోదు. ఎంతమంది అధ్యక్షులు మారినప్పటికీ అమెరికా తన వ్యవహార శైలి మాత్రం మార్చుకోదు.

అమెరికా సామ్రాజ్య వాదం ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు దానిని మరో స్థాయికి తీసుకెళ్తున్నాడు ట్రంప్. అమెరికా అంటేనే ఒక రకమైన అభిప్రాయం ప్రపంచ దేశాలకు కలగజేస్తున్నాడు. ఏ దేశంతో పొత్తు పెట్టుకుంటాడో .. ఏ దేశంతో యుద్ధం సాగిస్తాడో.. ఎవరికీ అంతు పట్టడం లేదు.

అమెరికా అధిపతిగా ట్రంప్ కేవలం ప్రపంచ దేశాల మీద మాత్రమే కాదు.. తన పైత్యాన్ని సొంత దేశం మీద కూడా రుద్దుతున్నాడు. సొంత ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇరాన్ దేశం మీద యుద్ధం సాగించడం వల్ల అమెరికా భారీగా నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి పన్నులు పెంచడం మొదలుపెట్టింది. దీంతో ట్రంప్ తీరు పట్ల అమెరికా ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అన్ని రాష్ట్రాలలో ప్రజలు రోడ్లమీదకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ తన తీరు మార్చుకోవడం లేదు. ఇక ఇప్పుడు అమెరికా 250 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటున్నది.

ఈ నేపథ్యంలో ట్రంప్ తనకు తాను అమెరికా కార్యసాధకుడిగా ట్రంప్ ప్రకటించుకున్నారు. అంతేకాదు తన పేరు మీద కాయిన్స్.. నోట్ల ప్రింటింగ్ మొదలుపెట్టారు. ట్రంప్ ముఖంతో డాలర్ కాయిన్ లు.. ఆయన సంతకంతో వంద డాలర్ల నోట్లను ప్రింటింగ్ మొదలుపెట్టారు. ఆయన సంతకంతో కూడిన నోట్లను.. విడుదల చేయబోతున్నారు. ట్రంప్ ముఖంతో విడుదలైన డాలర్ కాయిన్.. అతడి ముఖచిత్రంతో కనిపిస్తున్న డాలర్ నోట్లు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్రంప్ పరిపాలన మాదిరిగానే.. కాయిన్.. డాలర్ నోట్లు ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version