https://oktelugu.com/

2024 US elections : అమెరికాలో పోలింగ్ మొదలైంది.. తొలి ఫలితం కూడా వచ్చేసింది..

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి హడావిడి నెలకొంది. గత కొద్ది నెలలుగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం అక్కడ హోరాహోరీగా సాగింది. కమల హారీస్, డొనాల్డ్ ట్రంప్ నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 5, 2024 / 09:55 PM IST

    Us Elections

    Follow us on

    2024 US elections:     భారత కాలమానం ప్రకారం నవంబర్ 5న అక్కడ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ను ప్రారంభించిన కొంత సమయానికి ఎన్నికల ఫలితం కూడా వచ్చేసింది. అమెరికాలోని ఒక చిన్న కౌంటి (ప్రాంతం)లో ఓట్ల లెక్కింపు కూడా పూర్తయిపోయింది. న్యూ హంప్ షైర్ రాష్ట్రంలోని డిక్స్ విల్లే నాచ్ ప్రాంతంలో తొలి ఫలితం కూడా వచ్చింది. ఈ ప్రాంతంలో మొత్తం ఆరుగురు ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో భాగంగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు తక్కువగా ఉన్నప్పటికీ అమెరికా అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు… ఈ నేపథ్యంలో అక్కడి ఆరుగురు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తక్కువ ఓటర్లు ఉన్నప్పటికీ అధికారులు వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సౌకర్యాలు కల్పించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అధికారులు కౌంటింగ్ మొదలుపెట్టారు. అంతర్జాతీయ మీడియాలో దీనిపై వస్తున్న వార్తల ప్రకారం డెమొక్రటిక్ అభ్యర్థి కమల కు మూడు ఓట్లు లభించాయి. ట్రంప్ కు కూడా మూడు ఓట్లు వచ్చాయి. 2020లో డెమొక్రటిక్ అభ్యర్థి బైడన్ వైపు ఇక్కడి ప్రజలు మొగ్గు చూపారు.. ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. నాడు ఇక్కడ ఓట్లు సాధించకపోవడంతో ట్రంప్ ఓడిపోతాడని అందరూ భావించారు. వారు అంచనా వేసినట్టుగానే ట్రంప్ ఓడిపోయాడు. బైడన్ గెలిచాడు.. అయితే ఈసారి ఎన్నికల్లో కమల, ట్రంప్ చెరిసగం ఓట్లు సాధించిన నేపథ్యంలో పోటీ హోరాహోరీగా ఉంటుందని తెలుస్తోంది..

    కెనడా సరిహద్దున..

    డిక్స్ విల్లే నాచ్ కెనడా సరిహద్దులో ఉంటుంది.. ఇక్కడ ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. నలుగురు రిపబ్లికన్ పార్టీ తరఫున అమ్మ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. మిగతా ఇద్దరు ఏ పార్టీ తరఫున కూడా ఓటు నమోదు చేసుకోలేదు. అమెరికాలో నవంబర్ ఐదున ఎన్నికల ప్రక్రియ మొదలైంది. దానికంటే ముందు అమెరికాలో జాతీయగీతం ఆలపిస్తారు. జాతీయగీతం ఆలపించడం పూర్తయిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఈ కౌంటిలో కూడా అలానే చేశారు. ఈ కౌంటిలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించిన తర్వాత.. అధికారులు ఫలితాలను వెల్లడించారు. అమెరికాలో 1960 లో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సరికొత్త సంప్రదాయం తెరపైకి వచ్చింది.. ఆ సంవత్సరం నుంచి అర్ధరాత్రి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయం ఇక్కడ మొదలైంది. ఫలితంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశంలోనే తొలి ఫలితం వచ్చే ప్రాంతంగా డిక్స్ విల్లే నాచ్ పేరు పొందింది. ఈ ప్రాంతం కెనడాకు సరిహద్దున ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ ప్రజలను నివసించరు. పైగా ఈ ప్రాంతం ఎప్పటికీ చల్లగా ఉంటుంది. శీతకాలంలో అయితే విపరీతంగా మంచు కురుస్తుంది. వాతావరణం కూడా అత్యంత దుర్భేద్యంగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ ఎక్కువ జనసంచారం ఉండదు.