https://oktelugu.com/

Mahesh Babu : మహేష్ బాబు ను ఒక ఆట ఆడుకుంటున్న యాంటీ ఫ్యాన్స్…కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని వాటిని ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించి మొదటి నుంచి చివరి వరకు ఆ సినిమా కోసం పరితపిస్తూ ఉండాలి. అలా చేసినప్పుడే ఒక హీరోకి సక్సెస్ అనేది దక్కుతుంది... లేకపోతే మాత్రం సక్సెస్ రావడం అనేది చాలా కష్టం అవుతుందనే చెప్పాలి...

Written By:
  • NARESH
  • , Updated On : November 5, 2024 / 09:58 PM IST

    Mahesh-Rajamouli movie

    Follow us on

    Mahesh Babu :  తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు కృష్ణ… ఆయన చాలా కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. ఇక ఆయన తర్వాత తన వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తనదైన రీతిలో ఇండస్ట్రీకి సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకోవడంలో తను కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు మీద యాంటీ ఫ్యాన్స్ విపరీతమైన ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. అవి ఏంటి అంటే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో పెద్దగా వైవిధ్యం అయితే ఏమీ లేకుండా చాలా సింపుల్ గా సినిమాలను చుట్టేస్తు వచ్చాడు. ఇప్పటి వరకు సినిమాల కోసం పెద్దగా కష్టపడింది ఏమీ లేదు. కానీ రాజమౌళి సినిమా అంటే ఆషామాషీ కాదు. పూరి జగన్నాధ్, త్రివిక్రమ్ సినిమాల్లో నిలబడి నాలుగు డైలాగులు చెప్పినట్టుగా ఉండదు. ప్రతి సీన్లో ఒకటికి పది సార్లు టేకులు చేయాల్సి ఉంటుంది.

    ప్రతి షార్ట్ కష్టపడాల్సిన అవసరమైతే ఉంటుంది. మరి వాటన్నింటిని తట్టుకొని మహేష్ బాబు ఎలా నిలబడతాడు. రాజమౌళి ట్రీట్ మెంట్ కి మహేష్ బాబు ఎలా స్పందిస్తాడు అనేది తెలుసుకోవడానికి అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎప్పుడైతే షూట్ స్టార్ట్ అవుతుందో అప్పటినుంచి మహేష్ బాబుకు ఇబ్బందులు తప్పవు అంటూ యాంటి ఫ్యాన్స్ మహేష్ బాబు మీద చాలా రకాలుగా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు.

    ఇక ఇదిలా ఉంటే ఆయన అభిమానులు మాత్రం తనకు సపోర్టుగా మాట్లాడుతూ రాజమౌళి పెట్టే టాస్కులన్నింటిని మా హీరో ఈజీగా దాటుతాడు. అలాగే ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టబోతున్నాం అంటూ మహేష్ కి సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి టార్చర్ ని కనక భరించగలిగితే మహేష్ బాబు ఈ సినిమాను చాలా తొందరగా ఫినిష్ చేయగలుగుతాడు లేకపోతే మాత్రం ఈ సినిమా కోసం చాలా రోజుల సమయాన్ని తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది.