Homeఅంతర్జాతీయంUS big strategy behind war: యుద్ధం వెనక అమెరికా బిగ్ స్ట్రాటజీ.. భారత్ మేల్కోవాల్సిందే!...

US big strategy behind war: యుద్ధం వెనక అమెరికా బిగ్ స్ట్రాటజీ.. భారత్ మేల్కోవాల్సిందే! లేదంటే మునగడమే!

US big strategy behind war: ఇరాన్‌ అణు కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఉగ్రవాదులను తయారు చేస్తోందని అగ్రరాజ్యం అమెరికా యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్‌తో కలిపి ఇరాన్‌పై దాడులు చేస్తోంది. యుద్ధం మొదలు పెట్టిన మొదటి రోజే ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీని హతమార్చింది. దీంతో ఇరాన్‌ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఖమేనీ మరణంతో యుద్ధం ఆగిసోతుందని అంతా భావించారు. కానీ, నాలుగైదు వారాలు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించారు. దీంతో అమెరికా యుద్ధం వెనుక పెద్ద స్ట్రాటజీ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్మూజ్‌ సంధి మూసివేత..
ఇరాన్‌ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలపై దాడులో చేస్తోంది. ఇజ్రాయెల్‌పై మిస్సైళ్ల వర్షం కురిపిస్తోంది. దీంతో గల్ఫ్‌ దేశాల్లో ఆయిల్‌ ఉత్పత్తి తగ్గింది. మరోవైపు ఆర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేసింది. దీంతో 700లకుపైగా నౌకలు నిలిచిపోయాయి. ఫలితంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. 60 డాలర్లు ఉన్న బ్యారల్‌ ధర 90 నుంచి 100 డాలర్లకు పెరిగింది.

బలపడుతున్న డాలర్‌..
ఇక యుద్ధం కారణంగా అమెరికా డాలర్‌ బలపడుతోంది. పెట్టుబడిదారులు యూఎస్‌ ట్రెజరీ బాండ్లు కొనుగోలు చేస్తున్నారు. 2022 రష్యా–ఉక్రెయిన్‌లో డాలర్‌ విలువ 114కి చేరింది. 2008 ఫైనాన్షియల్‌ క్రై సిస్, 2020 కోవిడ్‌లో కూడా 10–15% బలోపేతం. ఇప్పుడు ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధంతో 83.50 దాటింది. ఫలితంగా మన రూపాయి బలహీనపడుతుంది.

Also Read: మిడిల్ ఈస్ట్ యుద్ధం.. దుబాయ్ పని అయిపోయినట్టేనా?

దిగుమతి భారం..
భారత్‌ రోజుకు 5.5 మిలియన్‌ బ్యారళ్ల ఆయిల్‌ దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 85 శాతం డాలర్‌తోనే కొనుగోలు చేస్తుంది. డాలర్‌ విలువ పెరుగుతుండడంతో భారత్‌ ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. దీంతో రోజువారి ఇంధన దిగుమతి విలు పెరుగుతుంది. డాలర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. మన రిజర్వు నిల్వలు తగ్గిపోతాయి.

అమెరికాకు లాభాలు..
యుద్ధాలు అమెరికా ఎగుమతులు ఖరీదు చేసి ట్రేడ్‌ డెఫిసిట్‌ తగ్గిస్తాయి. దీంతో అమెరికాకు లాభాలు పెరుగుతాయి. ఇప్పటికే టారిఫ్‌ల పేరుతో భారీగా లాభం పొందుతున్న అమెరికా ఇప్పుడు యుద్ధం పేరుతో డాలర్‌ విలువ పెంచుకుని మరింత లాభపడుతుంది.

ఈ నేపథ్యంలో భారత్‌ వ్యూహం మార్చాల్సిన అవసరం ఉంది. ఆయిల్‌ దిగుమతి రష్యా నుంచి పెచండం, బయోఫ్యూల్స్‌ (20% బ్లెండ్‌) పెంపు, దీర్ఘకాలంలో డీ–డాలరైజేషన్‌ వంటివి భారత్‌పై ప్రభావాన్ని తగ్గిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular