Mir Shukr Khan Raisani: పాకిస్తాన్‌లో అన్నీ అధోగతికి వెళ్తున్నాయి. రెండు విషయాలు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మొదటిది ఆర్థిక సంక్షోభం. ఎన్ని ప్రయత్నాలు చేసిన పాకిస్తాన్ రోజు రోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. రెండోది అజ్ఞాత సాయుధలు కడతేర్చే భారత వ్యతిరేక, జిహాదీ మతోన్మాదన ఉగ్రవాదులను లేపేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక సమస్యలను పరిష్కరించడం లేదు. ఇదే సమయంలో అజ్ఞాత సాయుధులను కూడా పట్టించుకోవడం లేదు. తాజాగా మరో దాడి జరిగింది.
సంబురాల వేళ కీలక కమాండర్..
తాజాగా పాకిస్తాన్ పది రోజుల పండుగ చేసుకుంటోంది. గతేడాది భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో విజయం సాధించామని చెప్పుకుంటూ ఈ పండుగ చేసుకుంటోంది. భారత దాడుల్లో పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక పాకిస్తాన్ ప్రతిదాడులను కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదే సమయంలో ఆ దేశంలోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఎయిర్ బేస్‌లు తుక్కుతుక్కు అయ్యాయి. ప్యాచ్‌లు వేసుకుని కవర్ చేసింది. కానీ పాక్ ప్రజలను ఏమార్చేందుకు తామే విజయం సాధించినట్లు పండుగ చేస్తోంది.
బలూచ్ వేడుకల్లో..
పాకిస్తాన్‌లోని అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్ రాజధాని ఖ్వెట్టాలో తాజాగా మర్కయా హఖ్ పేరుతో సంబురాలు నిర్వహించింది. ఇందులో లష్కర్ ఎ తోయిబా కీలక నేత బలూచిస్తాన్ ఇన్‌చార్జి హఫీజ్ ఇంద్రిస్ మోహల్‌తోపాటు భారత దేశంలో అనేక దాడులు నిర్వహించిన కరుడుగట్టిన జిహాదీ ఉగ్రవాది మీర్ షుకర్‌ఖాన్ రైసా ఉన్నాడు. వేడుకలు ఘనంగా జరిగాయి. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. పటాకులు కాల్చారు. రాత్రి సమావేశం ముగిసింది. కుర్చీలు తీస్తుండగా మీర్ షుకర్‌ఖాన్ రైసా శవమై కనిపించాడు. ఎవరు చంపారో తెలియదు. కానీ లేపేశారు.
పాక్ సైనికులు కూడా..
ఇదిలా ఉంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధలు పాకిస్తాన్ సైనికులను కూడా ఇదే సమయంలో లేపేశారు. ఒకవైపు ఉగ్రవాది మతమవ్వగా మరోవైపు మర్కయా హఖ్ బలూచిస్తాన్ పేరుతో బీఎల్‌ఏ సైనికులను చంపేసింది.
అజ్ఞాత సాయుధులకు భయపడి ఇప్పటికే ఉగ్రవాద సంస్థల కీలక నాయకులు అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాత సాయుధులకు భయపడుతున్నారు. ఇప్పటికే వందకుపైగా భారత వ్యతిరేక, ఉగ్రవాదులు అజ్ఞాత సాయుధుల చేతిలో చనిపోయారు. మరోవైపు హఫీజ్ ఇంద్రిస్ మోహల్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తానికి అజ్ఞాత సాయుధులు పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులతో ఉ*చ్చ పోయిస్తున్నారు.
