Homeఅంతర్జాతీయంUK F-35B fighter jet: ఎఫ్‌–35బి.. బ్రిటన్‌ రాయల్‌ నేవీ యుద్ధ విమానం.. స్టెల్త్ టెక్నాలజీ...

UK F-35B fighter jet: ఎఫ్‌–35బి.. బ్రిటన్‌ రాయల్‌ నేవీ యుద్ధ విమానం.. స్టెల్త్ టెక్నాలజీ చోరీ కాకుండా ఎలా విప్పేస్తున్నారంటే?

UK F-35B fighter jet: బ్రిటన్‌ రాయల్‌ నేవీకి చెందిన అత్యాధునిక ఎఫ్‌–35బి యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో 20 రోజుల క్రితం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. సాంకేతిక సమస్యలతో ఇన్ని రోజులు ఇక్కడే నిలిచిపోవడం సోషల్‌ మీడియాలో మీమ్స్, జోక్స్‌కు కారణమైంది. అయితే, ఈ విమానం యుద్ధ రంగంలో అసాధారణ సామర్థ్యం కలిగిన స్టెల్త్‌ జెట్‌గా పేరొందింది. ఇటీవల ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను ధ్వంసలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఎఫ్‌–35బిలో సాంకేతికత, రహస్య భద్రత అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

అత్యాధునిక స్టెల్త్‌ టెక్నాలజీ
ఎఫ్‌–35బి లాక్‌హీడ్‌ మార్టిన్‌ రూపొందించిన స్టెల్త్‌ యుద్ధ విమానం. రాడార్‌లను గుర్తించకుండా శత్రు రక్షణ వ్యవస్థలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. దీని డిజైన్‌లో ఏఐ, డేటా ఫ్యూజన్, ఎన్క్రిప్టెడ్‌ సాఫ్ట్‌వేర్, అధునాతన సెన్సర్లు, రాడార్‌ బ్లాకర్లు, ప్రత్యేక కోటింగ్‌లు ఉన్నాయి. ఈ విమానం అణ్వాయుధాలను కూడా ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉంది. 1.7 ట్రిలియన్‌ డాలర్ల వ్యయం, దాదాపు 20 ఏళ్ల కృషితో రూపొందిన ఈ జెట్‌ యుద్ధ రంగంలో బ్రిటన్, అమెరికా వంటి దేశాలకు కీలక ఆస్తిగా నిలుస్తోంది.

Also Read: భారత డ్రోన్లకు మస్తు డిమాండ్‌..?

సాంకేతిక సమస్య..
తిరువనంతపురంలో ఎఫ్‌–35బి నిలిచిపోవడం దాని సంక్లిష్ట నిర్మాణాన్ని, మరమ్మతుల సవాళ్లను బయటపెడుతోంది. ఈ విమానం ప్రతీ భాగం రహస్య సమాచారాన్ని కలిగి ఉంటుంది, నట్టు, బోల్టులకు కూడా ప్రత్యేక కోడ్‌లు ఉన్నాయి. దీంతో మరమ్మతులు కేవలం లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఇంజినీర్లకు మాత్రమే సాధ్యం. దీని భాగాలను విడదీసి, సీ–17 గ్లోబ్‌మాస్టర్‌ విమానంలో తరలించే ప్రక్రియలో బ్రిటన్‌ కఠిన భద్రతా చర్యలు తీసుకుంటోంది. ప్రతి స్క్రూ, భాగానికి సెక్యూరిటీ కోడ్‌లు ఇవ్వడం, ప్రతి చర్యను రికార్డు చేయడం ద్వారా స్టెల్త్‌ టెక్నాలజీ లీక్‌ కాకుండా చూస్తోంది. ఈ గోప్యతా చర్యలు దౌత్యపరమైన సమస్యలను నివారించడానికి కీలకం.

గతంలో గ్లోబ్‌ మాస్టర్‌లో తరలింపు..
2019లో ఫ్లోరిడాలోని ఇగ్లిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌లో ఎఫ్‌–35 రెక్కలను విడదీసి, సీ–17 గ్లోబ్‌మాస్టర్‌లో తరలించిన సంఘటన ఈ ప్రక్రియ సంక్లిష్టతను తెలియజేస్తుంది. లాజిస్టిక్స్‌ రెడీనెస్‌ స్క్వాడ్రన్‌ ఏరియల్‌ పోర్టర్స్‌ నిర్వహించిన ఈ ప్రాజెక్టు 2 లక్షల డాలర్ల వ్యయం, నాలుగేళ్ల కృషితో పూర్తయింది. అలాగే, 2021లో క్వీన్‌ ఎలిజిబెత్‌ విమాన వాహక నౌక నుంచి మధ్యదరా సముద్రంలో ఎఫ్‌–35బి కూలిపోయిన సంఘటనలో, రష్యా, చైనా వంటి దేశాలు దాని శకలాలను స్వాధీనం చేసుకుని స్టెల్త్‌ టెక్నాలజీని అపహరించే భయం బ్రిటన్‌ను ఆగమేఘాలపై గాలింపు చేయించింది. ఈ సంఘటనలు ఎఫ్‌–35 యొక్క రహస్య భద్రతా ప్రాముఖ్యతను హైలైట్‌ చేస్తాయి.

Also Read: 55 ఏళ్ల మామ కోసం ఏకంగా భర్తనే సుపారీ ఇచ్చి ఖతం చేయించిన భార్య నేర కథ

రాడార్‌ కన్నుకగప్పే సామర్థ్యం..
ఇటీవల టెహ్రాన్‌పై జరిగిన దాడుల్లో ఎఫ్‌–35 విమానాలు ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను గుర్తించకుండా చొచ్చుకుపోయి, కచ్చితమైన దాడులు చేసినట్లు తెలుస్తోంది. దీని స్టెల్త్‌ టెక్నాలజీ, రాడార్‌ బ్లాకర్లు, కృత్రిమ మేధస్సు ఆధారిత డేటా ఫ్యూజన్‌ వ్యవస్థలు ఈ విజయానికి కారణం. ఈ సామర్థ్యం ఎఫ్‌–35ని ఆధునిక యుద్ధ రంగంలో అపరాజిత ఆయుధంగా నిలిపింది. అయితే, ఈ టెక్నాలజీ లీక్‌ అయితే, శత్రు దేశాలు దీన్ని కాపీ చేసే ప్రమాదం ఉంది, ఇది బ్రిటన్, అమెరికాకు దౌత్యపరమైన, సైనిక సమస్యలను తెచ్చిపెడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version