Wife Kills Husband: ఇటీవల ఇండోర్ నగరానికి చెందిన ఓ జంట మేఘాలయ వెళ్ళింది.. పెళ్లయిన వారానికి హనీమూన్ నిమిత్తం ఆ జంట అక్కడికి వెళ్లింది. కానీ నవవధువు అప్పటికే ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవడం ఆమెకి ఇష్టం లేదు. పైగా భర్తతో గడపడం ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో అతని అడ్డును తొలగించుకుంది. దీనికి తన ప్రియుడి సహకారం తీసుకుంది. ఈ సంఘటన మేఘాలయలో జరగగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటనలో అడుగడుగునా అనేక నాటకీయ పరిణామాలు ఉన్నాయి. ఆ పరిణామాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన తర్వాత ఇలాంటి దారుణాలే దేశంలో చాలా వరకు చోటుచేసుకున్నాయి. అయితే ఇటువంటి ఘటన ఇప్పుడు మరొకటి జరిగింది.
Also Read: భారత డ్రోన్లకు మస్తు డిమాండ్..?
ఆ మహిళ పేరు గుంజ దేవి.. ఆమె స్వస్థలం బీహార్.. సరిగ్గా 45 రోజుల క్రితం ఆమెకు వివాహం జరిగింది. ఆమె భర్త పేరు ప్రియాంశు. అయితే పెళ్లికి ముందే గుంజ దేవికి ఒక రిలేషన్ ఉంది. ఆమెకు వరుసకు మామ అయ్యే జీవన్ సింగ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. అయితే గుంజా దేవి వయసు 20 సంవత్సరాలు. జీవన్ సింగ్ వయసు 55 సంవత్సరాలు. వీరి వ్యవహారం గుంజా దేవి ఇంట్లో తెలుసు. అయితే వయసు వ్యత్యాసం కారణంగా పెద్దలు వారి వివాహానికి ఒప్పుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఒత్తిడి తీసుకురావడంతో జీవన్ సింగ్ అనే యువకుడిని గుంజా దేవి వివాహం చేసుకుంది.
వివాహం జరిగిన నాటి నుంచి ప్రియాంశు తో గుంజా దేవి అంతగా ఇష్టాన్ని చూపించేది కాదు. పైగా జీవన్ సింగ్ ను మర్చిపోలేక నానా ఇబ్బంది పడేది. జూన్ 25న ప్రియాంశు ఒక పని మీద బయటకు వెళ్ళాడు. పని ముగించుకొని నవీ నగర్ రైల్వే స్టేషన్ లో దిగాడు. ఆ ప్రాంతానికి దగ్గరలో ఉన్న తన ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అతనికి సమీపంలోకి వచ్చారు. తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రియాంశు అక్కడికక్కడే చనిపోయాడు. వాస్తవానికి జీవన్ తోనే ఉండాలని నిర్ణయించుకున్న గుంజా దేవి.. తన భర్తను అంతం చేయాలని నిర్ణయించుకుంది. దీనికి తన మామ జీవన్ సింగ్ సహకారం తీసుకుంది. జీవన్ సింగ్ , గుంజా దేవి ఓ సుఫారి గ్యాంగ్ తో డీల్ కుదుర్చుకున్నారు. ఆ తర్వాత వారితో జీవన్ సింగ్ ను అంతం చేయించారు.
Also Read: మహిళల వాష్ రూమ్ లో కెమెరాలతో అశ్లీల వీడియోలు.. ఇన్ఫోసిస్ లో ఓ టెకీ పనులు.. దొరికాడిలా
అయితే జీవన్ సింగ్ పై కాల్పులు జరిపిన వ్యక్తులు దోపిడి దొంగలు అయి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఆ దిశగానే వారు దర్యాప్తు మొదలుపెట్టారు. వారి దర్యాప్తులో జీవన్ సింగ్ పై కాల్పులు జరిపింది దోపిడీ దొంగలు కాదని తేలింది. పైగా గుంజా దేవి వ్యవహార శైలి పోలీసులకు అనుమానం కలిగించింది.. ఆ కోణంలో వారు దర్యాప్తు జరిపారు. గుంజా దేవి ఫోన్ కాల్ డేటా పరిశీలించారు. ఆమె జీవన్ సింగ్ తో నిత్యం టచ్ లో ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో గుంజాదేవి గ్రామం నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నం చేసింది. ఇక అదే సమయంలో పోలీసులు గ్రామంలోకి ప్రవేశించారు. ఆమెను అరెస్ట్ చేశారు. జీవన్ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు పాల్పడిన సుఫారి గ్యాంగ్ సభ్యులను కూడా పోలీసులు జైలుకు పంపించారు.