Homeఅంతర్జాతీయంJodey Arrington: టెక్సాస్ 19వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ లో జోడీ అరింగ్టన్ విజయం..

Jodey Arrington: టెక్సాస్ 19వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ లో జోడీ అరింగ్టన్ విజయం..

Jodey Arrington: రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, టెక్సాస్ 19వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నాయకుడు జోడీ అరింగ్టన్ గురించి దేశం మొత్తం పరిచయం అవసరం లేదు. తను నాయకత్వం వహించిన ప్రాంతం నుంచి ఎన్నికవుతూనే ఉన్నారు. దాదాపు చాలా సంవత్సరాలు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించారు. జార్జి డబ్ల్యూ బుష్ గవన్నటోరియల్, ప్రెసిడెన్షియల్ అడ్మని స్ట్రేషన్ లో సభ్యుడిగా కూడా కొనసాగారు. జీన్-బెట్టీ అరింగ్టన్ కుమారుడు అరింగ్టన్. ప్లెయిన్ వ్యూలో పెరిగాడు. 2000 లో బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రెసిడెంట్ కు స్పెషల్ అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ గా చేశారు. 2014లో టెక్సాస్ స్టేట్ సెనేట్ డిస్ట్రిక్ట్ 28 కు ప్రత్యేక ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత గెలుస్తూ వచ్చారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లిబర్టేరియన్ అభ్యర్థి బెర్నార్డ్ జాన్సన్, ఇండిపెండెంట్ అభ్యర్థి నాథన్ లూయిస్ పై జోడీ అరింగ్టన్ విజయం సాధించారు. టెక్సాస్ లోని 19వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ఐదోసారి ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘మీకు సేవ చేయడం, వెస్ట్ టెక్సాస్ విలువల కోసం పోరాడడం జీవితకాల గౌరవం’ అని చైర్మన్ అరింగ్టన్ అన్నారు. ‘సంవత్సరాలుగా మీరు ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు – మేము ప్రతిరోజూ మీ ఆశీస్సులను కోరుకుంటాం. ‘నేను అడిగిన దానికన్నా, ఊహి౦చగలిగిన దానికన్నా దేవుడు నాకు ఎక్కువగా, సరిపోయేంతగా ఇచ్చాడు’ అన్నారు.

‘నేను ఇక్కడే ఉండాలని ఆయన కోరుకుంటున్నారని నూటికి నూరు శాతం నమ్మకంతో చెప్పగలను. ఆయన అనుగ్రహం అడుగడుగునా నాపై ఉంటుంది. ఎన్ని లోటు పాట్లు ఉన్నా భగవంతుడు మనకు విజయాలను అందిస్తూనే ఉన్నాడు. సరిహద్దును సురక్షితంగా ఉంచడానికి, వాషింగ్టన్ నిర్లక్ష్యపు ఖర్చులను నియంత్రించడానికి, అధికారాన్ని తిరిగి ‘వీ ద పీపుల్’కు తిరిగి ఇవ్వడానికి మా పోరాటాన్ని కొనసాగించడానికి నేను ఎదురుచూస్తున్నాను అన్నారు.

వాషింగ్టన్ లో నా తోటి వెస్ట్ టెక్సాన్ ప్రజల నమ్మకాన్ని మరోసారి సంపాదించుకున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. పశ్చిమ టెక్సాస్ ప్రజలు మన స్వేచ్ఛను ప్రోత్సహించే, మన పౌరులను రక్షించే, అధికారం చట్టబద్ధంగా అమెరికన్ ప్రజల చేతుల్లోనే ఉండేలా చూసే విధానాలను కోరుకుంటున్నారు. మా దేశ రాజధానిలో మీ గొంతుకగా ఉన్నందుకు ధన్యవాదాలు, దేవుడు ఆశీర్వదించి పశ్చిమ టెక్సాస్ కు వెళ్లండి అన్నారు. అసోసియేటెడ్ ప్రెస్ 9:21 pm (EST) వద్ద అరింగ్టన్‌ను విజేతగా ప్రకటించింది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular