Homeఅంతర్జాతీయంDonald Trump: ట్రంప్ వచ్చేస్తున్నాడుగా.. అమెరకన్లు తమ లెక్క తేల్చేశారా?

Donald Trump: ట్రంప్ వచ్చేస్తున్నాడుగా.. అమెరకన్లు తమ లెక్క తేల్చేశారా?

Donald Trump: అమెరికాలో మరోసారి ట్రంప్ హవా కొనసాగుతున్నది. ఈ సారి ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనట్లుగా నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి. ఇద్దరూ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వస్తారనే అంచనాల నేపథ్యంలో ఈసారి ప్రపంచ దేశాల దృష్టి అంతా అగ్రరాజ్యంపై పడింది. స్వింగ్ రాష్ర్టాల్లో కూడా ఈసారి ట్రంప్ హవా కనిపిస్తున్నది. రిపబ్లికన్ అభ్యర్థిగా ఉన్న ట్రంప్, తన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ పై స్వల్ప అధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇరువురు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నించారు. ఒకానొక దశలో కమలాహారిస్ అధిక్యాన్ని ప్రదర్శించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అంచనాలకు అందకుండా ట్రంప్ స్వల్ప అధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 272 మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా ట్రంప్ దూసుకెళ్తున్నట్లుగా ఫలితాల సరళిని బట్టి తెలుస్తున్నది. ఇప్పటికే ట్రంప్ 267, కమలాహారిస్ 224 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. దాదాపు స్వింగ్ రాష్ర్టాలైన ఏడింటిలో ట్రంప్ పూర్తి అధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మూడింట రిపబ్లికన్లు విజయం ఖరారు చేసుకున్నారు. మరో నాలుగు చోట్ల అధిక్యం కనబరుస్తున్నారు.

స్వింగ్ రాష్ర్టాలైన పెన్సిల్వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్, మిషిగన్, అరిజోనా, నెవడాలలో ట్రంప్ దూసుకెళ్లారు. మొదట్లో కమలా కొంత అధిక్యాన్ని ప్రదర్శించినా ట్రంప్ ఆమెను దాటేశారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కమలా హారిస్ కాలిఫోర్నియా, మెక్సికో, వర్జీనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్, ఓరెగన్, మేరిల్యాండ్, డెలవేర్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్, హవాయి, న్యూహ్యాంప్ సైట్, డిస్ర్టిక్ ఆఫ్ కొలంబియా, తదితర ప్రాంతాలను సొంతం చేసుకున్నట్లుగా సమాచారం.

ఇక దాదాపు ట్రంప్ విజయం ఖాయమైనట్లేనని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, మ్యాజిక్ ఫిగర్ 270. ఈ నేపథ్యంలో ట్రంప్ విజయం దాదాపు ఖరారైనట్లే. లూసియానా, ఇండియానా,జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వినియా, టెక్సాస్, మిస్సోరి, మిసిసిపీ, సౌత్ డకోటా, వెస్ట్ వర్జీనియా, టక్సాస్, ఒహాయె, తదితర రాష్ర్టాలను రిపబ్లికన్లు సొంతం చేసుకున్నారు.

ఇక ఇప్పటికే అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో ట్రంప్ మద్దతుదారుల సంబురాలు మొదలయ్యాయి. ఈ క్రమం లో కమలాహారిస్ తన ఎలక్షన్ నైట్ స్రసంగాన్ని రద్దు చేసుకున్నారు. మరోవైపు రిపబ్లికన్లు మాత్రం సంబురాల్లో మునిగితేలుతున్నారు. అమెరికా రిపబ్లికన్లకు అండగానిలిచిందని ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. ట్రంప్ విజయాన్ని కోరుకున్న పలు దేశాల్లో కూడా ఈ సంబురాలు మొదలయ్యాయి.

అయితే డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ కూడా ట్రంప్ కు గట్టి పోటీనిచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లుగానే పోరు సాగిందని చెబుతున్నారు. కానీ ఫలితాల్లో మాత్రం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు వెనుకబడ్డారు. దీనిపై సమీక్షించుకుంటామని ఆ పార్టీ సంబంధీకుడు ఒకరు అమెరికా మీడియాతో వెల్లడించారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular