https://oktelugu.com/

Covid Cases in USA: అమెరికా ఆరోగ్యవ్యవస్థకే చుక్క‌లు చూపిస్తున్న‌ క‌రోనా.. రాబోయే రోజుల్లో పీక్ స్టేజ్‌కి..

Covid Cases in USA: అగ్రరాజ్యం అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచంలో ఇక కరోనా మహమ్మారి అంతం అయిందని అనుకునే లోపే మరో నూతన వేరియంట్ పుట్టుకొస్తుంది. తాజాగా ఒమిక్రాన్, డెల్ట్రాక్రాన్ పేరిట వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఈ వేరియంట్స్ కేసులు భారత్ తో పాటు అగ్రరాజ్యం అమెరికాలోనూ పెరుగుతున్నాయి. అలా కొవిడ్ బారిన పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరుతుండటంతో ఆస్పత్రులపైన తీవ్ర ఒత్తడి పడుతోంది. అలా మరోసారి ఆస్పత్రులపైన ఒత్తిడి పెంచుతోంది అమెరికా. గతేడాది […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 11, 2022 / 04:02 PM IST
    Follow us on

    Covid Cases in USA: అగ్రరాజ్యం అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రపంచంలో ఇక కరోనా మహమ్మారి అంతం అయిందని అనుకునే లోపే మరో నూతన వేరియంట్ పుట్టుకొస్తుంది. తాజాగా ఒమిక్రాన్, డెల్ట్రాక్రాన్ పేరిట వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఈ వేరియంట్స్ కేసులు భారత్ తో పాటు అగ్రరాజ్యం అమెరికాలోనూ పెరుగుతున్నాయి. అలా కొవిడ్ బారిన పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరుతుండటంతో ఆస్పత్రులపైన తీవ్ర ఒత్తడి పడుతోంది. అలా మరోసారి ఆస్పత్రులపైన ఒత్తిడి పెంచుతోంది అమెరికా.

    Covid Cases in USA

    గతేడాది జనవరి 14న కొవిడ్ వేరియంట్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు కాగా, అంతే స్థాయిలో మంది ఆస్పత్రుల్లో చేరారు. తాజాగా ఈ ఏడాది కూడా అటువంటి పరిస్థితే నమోదయింది. ఒమిక్రాన్ , ఇతర వేరియంట్లు సోకి 1,41, 385 మంది ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇది గతేడాది సంఖ్య కంటే ఎక్కువనే కాగా, త్వరలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలా అమెరికాలో ఒమిక్రాన్ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

    Also Read:  సర్ ప్రైజ్: కొత్త వ్యాపారం మొదలు పెట్టిన వెంకటేష్ !

    ఇలా ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగినట్లయితే ఆస్పత్రులపైన తీవ్రమైన భారం పడి.. ఆరోగ్య వ్యవస్థ కుప్పుకూలే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో ముఖ్యంగా వైద్య సిబ్బందిపైన తీవ్రమైన ఒత్తిడి పడుతోంది. కరోనా సోకినా వారు విధులకు హాజరు కావాలనే ఆదేశాలు అమలు చేయడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పేషెంట్ కాంటాక్ట్ లోకి వెళ్లేందుకుగాను సిబ్బంది ఎన్-95 మాస్కులు ధరిస్తే చాలన్న నిబంధన భయపెడుతోంది.

    ఈ క్రమంలోనే వైరస్ సోకిన సిబ్బంది కూడా విధులకు హాజరు కావాల్సిందే అని ఇచ్చిన ఆదేశాలపైన పలువురు మండి పడుతున్నారు. అలా వైరస్ సోకిన సిబ్బంది విధుల్లోకి వస్తే కనుక ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు వైద్యులు పేర్కొంటున్నారు. ఇకపోతే వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ ఈ స్థాయిలో కేసులు పెరుగుతుండటం చూసి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇలా కేసులు పెరగడానికి ప్రధాన కారణం కొందరు వ్యాక్సిన్ తీసుకోకపోవడమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పరిస్థితులు ఇలానే కొనసాగితే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    Also Read: సినిమా వాళ్ళు “బలిసి” కొట్టుకోవడం లేదు. “భయం” తో.. బతుకు జీవుడా అంటున్నారు !

    Tags