Samantha-Rashmika Mandanna: క్రేజీ బ్యూటీ ‘రష్మిక మండన్నా’ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతుందని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. పైగా ఈ మూవీలో ఆమె నటించడానికి ముఖ్య కారణం సమంత అంటూ వార్తలు వచ్చాయి. ఇంతకీ రష్మిక సినిమాకు సామ్ కి సంబంధం ఏమిటి అంటే.. ఈ సినిమా దర్శకుడు సమంత స్నేహితుడు రాహుల్ రవీంద్రన్. రాహుల్ రవీంద్రన్ హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయాడు.

అయితే, డైరెక్టర్ గా మాత్రం రాహుల్ రవీంద్రన్ మంచి విజయం సాధించాడు. అందుకే, మళ్ళీ మరో సినిమాను డైరెక్ట్ చేయడానికి సన్నద్ధం అయ్యాడు. ఇంతకీ రష్మికనే ఎందుకు హీరోయిన్ గా తీసుకున్నాడు అంటే.. సామ్ చెప్పింది అని. మొదట రాహుల్ రవీంద్రన్ సామ్ తో ఈ సినిమా చేయాలనుకున్నాడు. అయితే, కథ మొత్తం విన్న సమంత, ఈ సినిమా నాతో కంటే.. రష్మికతో చేయడమే కరెక్ట్ అంటూ ఆమె స్వయంగా రష్మికకు ఫోన్ చేసి ఈ కథ గురించి చెప్పి.. దయచేసి సినిమా చేయమని అడిగిందట.
రాహుల్ రవీంద్రన్ దగ్గర కథ విన్న రష్మిక సినిమా చేయడానికి అంగీకరించింది. ఇంతకీ కథ ఏమిటంటే.. దివంగత మాజీ పీఎం పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల.. ఓ కిరాణా కొట్టు పెట్టుకున్న ఒక యువతి అతి తక్కువ సమయంలోనే పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎలా ఎదిగింది ? ఆ ఎదిగే సమయంలో ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి ? అనేది మెయిన్ కథాంశం అని తెలుస్తోంది.
Also Read: సమంతను హీరోయిన్‌గా నిలబెట్టిన చిత్రాలివే..!
కాగా మన్మథుడు 2 పరాజయం తర్వాత రాహుల్ రవీంద్రన్‌కు డైరెక్టర్‌గా అవకాశం రాలేదు. సమంత కారణంగా ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. మొత్తమ్మీద రష్మిక ఇప్పటివరకు కొన్ని పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో నటించింది గాని, ఇలా సోలోగా మెయిన్ సినిమా చేయలేదు. మరి మొదటసారి ఆమె పై ఒక సినిమాని తీసుకురాబోతున్నారు. ఈ సినిమా వర్కౌట్ అయితే ఆమె నుంచి మరిన్నీ సినిమాలు రావడం పక్కా.
అన్నట్టు రష్మిక బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ సినిమా చేస్తోంది కాబట్టి.. ఆమెకు పాన్ ఇండియా మార్కెట్ కొంతైనా వస్తోంది. . ‘చి.ల.సౌ’ సినిమాతో దర్శకుడిగా హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ చేయబోతున్న ఈ కొత్త సినిమాలో సామ్ కూడా ఓ అతిధి పాత్రలో నటించబోతుందట.
Also Read: వీడియోతో ఓ ఊపు ఊపేస్తున్న రష్మిక !
[…] Sankranti 2022 Telugu Movies: తెలుగు తెరకు సంక్రాంతి సీజన్ అంటే మహా పెద్ద పండుగ. అయితే, ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు పోస్ట్ ఫోన్ కాక తప్పలేదు. అసలు సంక్రాంతి సీజన్ లోనే పెద్ద చిత్రాలన్నీ రిలీజ్ అవుతాయి. అయితే, కరోనా మూడో వేవ్ కారణంగా అన్నీ పెద్ద సినిమాలు పోస్ట్ ఫోన్ అవ్వడం.. చిన్న సినిమాలకు కలిసి వచ్చింది. ఒకటి రెండు కాదు, ఏకంగా లెక్కకు మించి చిన్న సినిమాలు ఇప్పుడు తెలుగు బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధం అయ్యాయి. […]
[…] Also Read: నాతో కంటే రష్మికతో చేయడమే కరెక్ట్ – స… […]
[…] Also Read: నాతో కంటే రష్మికతో చేయడమే కరెక్ట్ – స… […]