Shimbu: హీరో శింబుకు అరుదైన పురస్కారం.. ఫ్యాన్స్ ఖుషీ..!

Shimbu Doctorate : తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నటుల్లో శింబు ఒకరు. చిన్నతనం నుంచే శింబు ఫ్యామిలీకి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో ఈ రంగంపై శింబు సైతం ఆసక్తి పెంచుకున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు టి. రాజేందర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శింబు హీరోగాను రాణించి కోలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు. హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. శింబు నటించిన సినిమాలు డైరెక్టుగా తెలుగులోనూ విడుదల […]

Written By: Raghava Rao Gara, Updated On : January 11, 2022 4:07 pm
Follow us on

Shimbu Doctorate : తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నటుల్లో శింబు ఒకరు. చిన్నతనం నుంచే శింబు ఫ్యామిలీకి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో ఈ రంగంపై శింబు సైతం ఆసక్తి పెంచుకున్నాడు. ప్రముఖ దర్శకుడు, నటుడు టి. రాజేందర్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శింబు హీరోగాను రాణించి కోలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు.

హీరో శింబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమే. శింబు నటించిన సినిమాలు డైరెక్టుగా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. దీంతో అతడికి టాలీవుడ్లోనూ క్రేజ్ ఏర్పడింది. ‘శింబు’..‘మన్మథ’ వంటి చిత్రాలు తెలుగులోనూ మంచి విజయాలు సాధించాయి. తన నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను అలరిస్తున్న శింబుకు తాాజాగా ఓ అరుదైన గౌరవం లభించడంతో అతడి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శింబును డాక్టరేట్ తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబునే స్వయంగా తన ట్వీటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. శింబు డాక్టరేట్ తీసుకుంటున్న కార్యక్రమానికి అతడి తల్లిదండ్రులు రాజేందర్, ఉషలు హాజరై తమ సంతోషాన్ని యూనివర్సీటీ విద్యార్థులు, ప్రొఫెసర్లతో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన పలు పిక్స్ ను శింబు తన ట్వీటర్లో పోస్టు చేశాడు.

తనకు అరుదైన గౌరవం అందించిన వేల్స్‌ యూనివర్సిటీకి శింబు తన కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే ఈ పురస్కారాన్ని తమిళనాడుతోపాటు తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. తన జీవితంలో సినిమా ఉందంటే దానికి వారే ముఖ్య కారణమని తెలిపాడు. అలాగే తనను ఎంతగానో ఆదరించిన అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నా అంటూ  శింబు భావోదేగ్వానికి గురయ్యాడు. ఇక శింబుకు డాక్టరేట్ దక్కడంపై అతడి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.