US Presidential Election : అమెరికా అధ్యక్ష ఎన్నిలకు నవంబర్ 5న జరుగనున్నాయి. ప్రచారానికి ఇంకా 15 రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం మరింత స్పీడ్ చేశారు. ఇక ఈసారి అధ్యక్ష ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా పోటాపోటీగా జరుగుతున్నాయి. అధికార డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు డెమొక్రటిక్ పార్టీ.. ఎలాగైనా గెలిచి తీరాలని రిపబ్లికన్ పార్టీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో సర్వే సంస్థలు అమెరికాకు కాబోయే అధ్యక్షులు ఎవరన్న విషయమై ఓటరు నాడి పట్టే ప్రయత్నం చేస్తున్నాయి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ ఉన్నంతసేపు ట్రంప్ రేసులో ముందు ఉన్నాయి. పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై దుండగుడి కాల్పుల తర్వాత మరింత సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో బైడెన్ అనూహ్యంగా తప్పుకున్నారు. దీంతో కమలా హారిస్ రేసుకోకి వచ్చారు. బైడెన్ కన్నా.. కమలాను ఓడించడం చాలా ఈజీ అని వ్యాఖ్యానించిన ట్రంప్‌కు సర్వే సంస్థలు షాక్ ఇచ్చాయి. పలు సర్వేల్లో ట్రంప్ కన్నా.. కమలా ముందున్నారు. సెప్టెంబర్ 10న జరిగిన డిబేట్ తర్వాత కమలా గ్రాఫ్ అమాంతం పెరిగింది. కమలా హారిస్, ట్రంప్ మధ్య ఓట్ల తేడా 4 శాతం ఉంది. దీంతో ఇక ట్రంప్ గెలుపు కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ పంజుకుంటున్నారు. తాజా సర్వేలో ట్రంప్ ఓట్ల శాతం పెరిగింది.
స్వల్ప ఆధిక్యంలో కమలా హారిస్..
తాజాగా నిర్వహించిన సర్వేలో కమలా హారిస్‌కు 48 శాతం మంది మద్దతు తెలుపగా ట్రంప్‌కు 46 శాతం మంది మద్దతు తెలిపారు. ఇది డిబేట్ తర్వాత కమలాకు 48 శాతం మద్దతు ఇవ్వగా, ట్రంప్‌కు 44 శాతం మందే మద్దతు ఇచ్చారు. కానీ, తాజాగా ఈ తేడా 2 శాతం తగ్గింది. ట్రంప్ అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో కలిసి ప్రచారం చేయడం, అమెరికా అధ్యక్షుడిగా చేసే పనులు, విదేశాలతో సఖ్యత, కఠిన వైఖరి, వలసల కట్టడి వంటి అంశాలు ట్రంప్‌కు అనుకూలంగా మారుతున్నారు. మరోవైపు ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కమలా హారిస్‌కు వ్యతిరేకంగా మారుతున్నాయి
బయటపడిన ట్రంప్ అసలు రూపం..
ఇక అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌పై కఠిన వైఖరి అవలంబించిన ట్రంప్.. ఎన్నిల సందర్భంగా సానుకూలంగా మాట్లాడారు. స్వింగ్ సిటీస్‌లో ఓట్ల కోసం భారత్‌తో సఖ్యతగా ఉండనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. కానీ తాజాగా ఆయన మళ్లీ తన పాత రూపం బయటపెట్టారు. భారత్ విషయంలో మరోసారి నోరు జారారు. ఇటీవల మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. రెండు రోజుల్లోనే భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా తయారు చేసిన వస్తువులపై భారత్ అధిక పన్నులు విధిస్తోందని ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే.. భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్ను పెంచుతానని ప్రకటించారు.
గతంలో టారిఫ్ కింగ్ అని..
గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ భారత్‌ను టారిఫ్ కింగ్ అని అభివర్ణిచారు. ఈ క్రమంలోనే భారత్‌కు జీఎస్‌పీ(జరరలైజ్‌డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్)ని రద్దు చేశారు. ఈ హోదా ఉంటే.. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఎలాంటి ట్యాక్స్ లేకుండా అమెరికాకు ఎగుమతులు చేయడానికి వీలుంటుంది. జీఎస్‌పీ కారణంగా భారత్– అమెరికా మధ్య ఎగుమతులు, దిగుమతులు సమానంగా, హేతుబద్ధంగా లేవని ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై భౠరత్ 200 శాతం పన్ను వసూలు చేస్తుంటే.. అమెరికా మాత్రం భారత ఉత్పత్తులపై ట్యాక్స్ విధించకూడదా అని ప్రశ్నించారు. 2024లో తను అధ్యక్షుడిగా గెలిపిస్తే ప్రతీకార పన్ను విధిస్తానని హెచ్చరించారు.