Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నంత పని చేశారు. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించారు. రష్యా, ఉత్తర కొరియా మినహా అమెరికాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపై సుంఖాలు విధించారు. దీంతో ప్రపంచ మార్కెట్లలో సంక్షోభం నెలకొంది. భారత్ మార్కెట్‌లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
CM Revanth Reddy: రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలపై సుంకాల(Tariffs)ను ప్రకటించి వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. భారత ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్లు వెల్లడించిన ట్రంప్, ఈ నిర్ణయాన్ని భారత కాలమానం ప్రకారం బుధవారం(Wedns day) అర్ధరాత్రి దాటిన 1:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు) వాషింగ్టన్ డీసీలో ప్రకటించారు. ఈ రోజును ’లిబరేషన్ డే’గా అభివర్ణించిన ఆయన, అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం సుంకం విధిస్తామని, అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేసే దేశాలపై వాటి సగం మేర ప్రతీకార సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు.
ఎదురుదెబ్బగా భావించడం లేదు..
ట్రంప్ ప్రకటనలో భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు, దీనిలో 10 శాతం ఏప్రిల్ 5 నుంచి, మిగిలిన 16 శాతం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. ఈ సుంకాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించింది. ‘ఈ టారిఫ్‌లను ఎదురుదెబ్బగా భావించడం లేదు. అమెరికా(America) ఆందోళనలను పరిష్కరిస్తే సుంకాల తగ్గింపుకు అవకాశం ఉంది. ఇది భారత్‌కు మిశ్రమ ఫలితమే తప్ప పూర్తి నష్టం కాదు,‘ అని ఆ అధికారి తెలిపారు. ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narnedra Modi)ని ప్రస్తావిస్తూ, ‘మోదీ నాకు గొప్ప స్నేహితుడు, కానీ భారత్ అమెరికాతో సరిగా వ్యవహరించడం లేదు. అమెరికా ఉత్పత్తులపై 52 శాతం సుంకాలు విధిస్తోంది,‘ అని విమర్శించారు. దీనికి ప్రతిగా భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ మార్కెట్లలో సంక్షోభం
ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు(Stack Markets) కుదేలయ్యాయి. ఆసియా(Asia) మార్కెట్లలో జపాన్ నిక్కీ 3.4 శాతం కుంగగా, దక్షిణ కొరియా కోస్పీ 1.9 శాతం, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1.8 శాతం నష్టపోయాయి. భారత మార్కెట్లు కూడా గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
లాభాల్లో అమెరికా మార్కెట్లు..
అమెరికా మార్కెట్ల(America Markets)లో ట్రంప్ ప్రకటనకు ముందు ఎస్ అండ్ పీ 500 సూచీ 0.7 శాతం, డో జోన్స్ 0.6 శాతం, నాస్‌డాక్ 0.9 శాతం లాభపడ్డాయి. కానీ ప్రకటన తర్వాత ఫ్యూచర్ మార్కెట్లు దెబ్బతిన్నాయిఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 3 శాతం, డో జోన్స్ 2 శాతం, నాస్‌డాక్ 4 శాతం కుంగాయి. గురువారం అమెరికా ట్రేడింగ్‌లో భారీ నష్టాలు ఉంటాయని అంచనా.
బంగారం రికార్డు – చమురు ధరల క్షీణత
టారిఫ్‌ల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల అనిశ్చితి మధ్య బంగారం ధరలు(Gold Rates) ఆకాశాన్నంటాయి. అమెరికా మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర 0.4 శాతం పెరిగి 3,145.93 డాలర్లకు చేరగా, ఒక దశలో 3,167.57 డాలర్లతో కొత్త రికార్డు సష్టించింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్సు ధర 3,170.70 డాలర్ల వద్ద ఉంది.
మరోవైపు, చమురు(Oil)ధరలు క్షీణించాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ 2.63 శాతం తగ్గి బ్యారెల్‌కు 72.98 డాలర్లు, క్రూడ్ ఫ్యూచర్స్ 2.76 శాతం క్షీణించి 69.73 డాలర్లకు చేరాయి. భారత రూపాయి విలువ 10–15 పైసలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.