Trump Tariff On India: అమెరికా టారిఫ్‌ల ప్రభావం మన దేశంలో చాలా రంగాలపై పడుతుందని నిపుణులు అంటున్నారు. వ్యవసాయం(Agricultar) నుంచి ఎలక్ట్రానిక్స్(Electronics)వరకు టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే దేశ వాణిజ్య శాఖ మాత్రం పెద్దగా ఇబ్బందులు ఉండవంటోంది. భారత్ వైవిధ్యీకరణ వ్యూహాలు, చర్చల ద్వారా ఈ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: హెచ్‌సీయూ భూములు ఎవరూ కొనొద్దు.. వెనక్కి తీసుకుంటామన్న కేటీఆర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అంచనాలను మించి భారత్‌పై టారిఫ్ బాంబు వేశారు. న్యూఢిల్లీని వాణిజ్య భాగస్వామిగా పేర్కొంటూనే, భారత ఉత్పత్తులపై 26 శాతం సుంకాలను ప్రకటించారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధించే సుంకాలతో పోలిస్తే తాము సగం మేర మాత్రమే వసూలు చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. భారత్ అమెరికా వస్తువులపై సగటున 52 శాతం సుంకం విధిస్తుందని, అందుకే 26 శాతం టారిఫ్‌లు విధిస్తున్నామని వెల్లడించారు. ఈ నిర్ణయం భారత్‌లో వ్యవసాయం, ఫార్మా, జౌళి, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాలపై గణనీయమైన ప్రభావం చూపనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వ్యవసాయం, డెయిరీ, సీఫుడ్ రంగాలపై ఎఫెక్ట్
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) విశ్లేషణ ప్రకారం, ట్రంప్ టారిఫ్‌లు వ్యవసాయ రంగ ఎగుమతుల(Agricultar exports)పై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. అమెరికా భారత సీఫుడ్(See foods) ఉత్పత్తులకు ప్రధాన మార్కెట్‌గా ఉంది. 2024లో చేపలు, రొయ్యలు, ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతుల విలువ 2.58 బిలియన్ డాలర్లుగా నమోదైంది. కొత్త సుంకాలతో ఈ ఉత్పత్తుల ధరలు అమెరికాలో పెరిగి, డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెయిరీ(Dairy) రంగంపైనా ఈ టారిఫ్‌లు భారీ ఒత్తిడి తెస్తాయి. భారత్ నుంచి అమెరికాకు ఏటా 181.49 మిలియన్ డాలర్ల విలువైన వెన్న, నెయ్యి, పాలపొడి వంటి డెయిరీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ సుంకాలతో డెయిరీపై టారిఫ్ 38.23 శాతానికి చేరనుంది, దీంతో అమెరికా మార్కెట్లో ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. అలాగే, ప్రాసెస్డ్ ఫుడ్, చక్కెర, కోకో ఎగుమతులు కూడా ప్రభావితం కానున్నాయి.
జౌళి, ఆభరణాలపై ప్రభావం
భారత్ నుంచి అమెరికాకు ఏటా 11.88 బిలియన్ డాలర్ల విలువైన బంగారం(Gold), వెండి(Silver), వజ్రాభరణాలు(Dimond Jwellers) ఎగుమతి అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్‌లతో ఈ రంగంపై సుంకం 13.32 శాతానికి పెరగనుంది, దీంతో అమెరికాలో ఆభరణాల ధరలు పెరిగే అవకాశం ఉంది. జౌళి పరిశ్రమ కూడా ఈ దెబ్బ నుంచి తప్పించుకోలేదు. 2023–24లో 9.6 బిలియన్ డాలర్ల విలువైన దుస్తులు, టెక్సై్టల్ ఫ్యాబ్రిక్స్ అమెరికాకు ఎగుమతి అయ్యాయి, ఇది మొత్తం టెక్సై్టల్ ఎగుమతుల్లో 28 శాతం. ఈ సుంకాలు ఈ రంగంలో పోటీతత్వాన్ని దెబ్బతీయవచ్చు.
పాదరక్షలపై సుంకాల భారం
పాదరక్షల రంగంపై కూడా టారిఫ్‌ల ప్రభావం తప్పదు. భారత్ నుంచి అమెరికాకు 457.66 మిలియన్ డాలర్ల విలువైన చెప్పులు, ఇతర పాదరక్షలు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఉత్పత్తులపై అమెరికా–భారత్ మధ్య సుంకాల వ్యత్యాసం 15.56 శాతంగా ఉంది. దీంతో అమెరికా మార్కెట్లో భారత చెప్పుల ధరలు పెరిగి, వినియోగదారులు ఇతర దేశాల ఉత్పత్తుల వైపు మళ్లే అవకాశం ఉంది.
ఎలక్ట్రానిక్స్ రంగంలో ధరల పెరుగుదల
ఎలక్ట్రానిక్స్ మరియు టెలికాం(Telicom) రంగంలో భారత్ 2024లో అమెరికాకు 14.39 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. కొత్త సుంకాలతో ఈ ఉత్పత్తుల ధరలు అమెరికాలో పెరగనున్నాయి. బాయిలర్లు, టర్బైన్స్, కంప్యూటర్ల వంటి యంత్రాల ధరలు కూడా ప్రియమవుతాయి, దీంతో ఈ రంగంలో భారత్ పోటీతత్వం తగ్గే ప్రమాదం ఉంది.
ఫార్మా రంగంపై స్వల్ప ప్రభావం
ఫార్మా రంగంలో భారత్ అమెరికాకు జనరిక్ మందులను పెద్ద ఎత్తున సరఫరా చేస్తుంది. ఈ సుంకాలు ధరలను కొంత పెంచినప్పటికీ, అమెరికా ఈ మందులపై ఆధారపడటం వల్ల ప్రభావం పరిమితంగా ఉండవ�–:చ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.