Y S Jagan Mohan Reddy : వైయస్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) కోటరిలో సభ్యుడిగా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Reddy Bhaskar Reddy ). అయితే జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటున్నారే తప్ప.. అధినేతకు కానీ, పార్టీకి కానీ ఆయన ఉపయోగపడడం లేదన్న టాక్ ఉంది. తన వీర విధేయతతో జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గత పది ఏళ్లలో అనేక రకాలుగా లబ్ది పొందారు. పార్టీ అధినేత ఇప్పుడు కష్టాల్లో ఉంటే తనకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు ఆయన వ్యవహార శైలి హాట్ టాపిక్ అవుతోంది. కేసులకు భయపడి ఆయన ఏం మాట్లాడడం లేదని పార్టీలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయి రెడ్డి లాంటి వారు కూడా రాజీనామా చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయులుగా ఉన్నారు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే ఆ ఇద్దరు నేతలు సమయం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం సైలెంట్ అయ్యారు.
Also Read : వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తీరని విషాదం!
* ఆ కోటరీలో కీలక వ్యక్తి..
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోటరీ లో ఒక వ్యక్తి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ టీం( Jagan team) లో చేరారు చెవిరెడ్డి. ముందుగా రాష్ట్రంలో రాజకీయ వారసత్వానికి సంబంధించి చెవిరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి అవకాశం కల్పించారు. అయితే ఇకనుంచి తాను తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటానని.. మీ టీం లో చేర్పించుకోవాలని చెవిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని పలుమార్లు అడిగారట. అలా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలోకి ఎంట్రీ ఇచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ ఎందుకో మిగతా నేతల మాదిరిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యాక్టివ్ గా పని చేయడం లేదట. వాస్తవానికి చెవిరెడ్డికి చాలా రకాల అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సార్వత్రికి ఎన్నికల్లో ఏకంగా ఒంగోలు జిల్లా నే అప్పగించారు. ఒక విధంగా చెవిరెడ్డి మూలంగానే బాలినేని పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారన్న టాక్ కూడా ఉంది.
* అన్ని విధాలా లబ్ది..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయంగాను లాభపడ్డారు.. ఆర్థికంగాను బలోపేతం అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎప్పుడో కాంగ్రెస్( Congress) హయాంలో ఆయన జడ్పిటిసిగా ఎన్నికయ్యారు. అటువంటి వ్యక్తిని గుర్తించి రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీ వెంట అడుగులు వేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సైతం కీలకమైన చంద్రగిరి నియోజకవర్గంలో ఛాన్స్ ఇచ్చారు. నాయకుడిగా ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. 2019 ఎన్నికల్లో రెండోసారి చంద్రగిరి నుంచి గెలిచేసరికి విప్ గా ఛాన్స్ ఇచ్చారు. 2024 ఎన్నికల కు ముందు తన కుమారుడు మోహిత్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా జగన్మోహన్ రెడ్డి సమ్మతించారు. మోహిత్ రెడ్డికి చంద్రగిరి.. భాస్కర రెడ్డికి ఒంగోలు పార్లమెంటు సీటును కేటాయించారు. కానీ రెండు చోట్ల ఓడిపోయారు తండ్రీ కొడుకులు.
* బాలినేని కామెంట్స్ పై..
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ ఆ మధ్యన జనసేన ఆవిర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivas Reddy ). జగన్మోహన్ రెడ్డి తన భూములను బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. అయితే ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఈ మాటలను చెవికెక్కించుకోలేదు. మీడియా ముందుకు వచ్చి ఖండించలేదు. అసలు బాలినేనికి కౌంటర్ ఇవ్వలేకపోయారు. అయితే దీనిని ప్రత్యేకంగా గుర్తించారట జగన్మోహన్ రెడ్డి. ఏకంగా తనపై మాటల దాడి చేస్తుంటే భాస్కర్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారట. ఇలాంటి వ్యక్తి తన వద్ద ఉంటే నష్టమని భావిస్తున్నారట. ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకుంటే మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇబ్బంది తప్పదు.
Also Read : అదిరేటి డ్రెస్ తో ఆకట్టుకున్న జగన్!