Homeఅంతర్జాతీయంTrump Spain Military Base Rejection: ట్రంప్‌ పరువు తీసిన స్పెయిన్‌.. యుద్ధ ప్రణాళికలకు బ్రేక్‌!

Trump Spain Military Base Rejection: ట్రంప్‌ పరువు తీసిన స్పెయిన్‌.. యుద్ధ ప్రణాళికలకు బ్రేక్‌!

Trump Spain Military Base Rejection: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు పోయింది. యుద్ధంలో యుద్ధ విమానం కోల్పోవడం వల్లనో, నౌకాదళానికి చెందిన పెద్ద ఫీల్డ్‌ ధ్వంసం కావడం వల్లనో ఎయిర్‌ బేస్‌లు ధ్వంసం కావడం వల్లనో, ఇరాన్‌ భారీ దాడి కారణంగానో ఇది జరలేదు. తోటి తెల్లజాతి దేశం స్పెయిన్‌ ట్రంప్‌ పరువు తీసింది. ట్రంప్‌ను అసలు లెక్కలోకి తీసుకోలేదు. ఇరాన్‌పై దాడికి ఇప్పుడు ఉన్న బేస్‌లు చాలవన్నట్లు స్పెయిన్‌లోని దక్షిణ భాగం నుంచి దాడి […]

Trump Spain Military Base Rejection: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్‌ పరువు పోయింది. యుద్ధంలో యుద్ధ విమానం కోల్పోవడం వల్లనో, నౌకాదళానికి చెందిన పెద్ద ఫీల్డ్‌ ధ్వంసం కావడం వల్లనో ఎయిర్‌ బేస్‌లు ధ్వంసం కావడం వల్లనో, ఇరాన్‌ భారీ దాడి కారణంగానో ఇది జరలేదు. తోటి తెల్లజాతి దేశం స్పెయిన్‌ ట్రంప్‌ పరువు తీసింది. ట్రంప్‌ను అసలు లెక్కలోకి తీసుకోలేదు. ఇరాన్‌పై దాడికి ఇప్పుడు ఉన్న బేస్‌లు చాలవన్నట్లు స్పెయిన్‌లోని దక్షిణ భాగం నుంచి దాడి చేసేందుకు బేస్‌ అడిగారు. దీనిని స్పెయిన్‌ తిరస్కరించింది. ఆ దేశ ప్రధాని పెద్రో సాంచెజ్‌ బేస్‌ ఇవ్వమని తెగేసి చెప్పారు.
తిరస్కరణకు కారణం..
స్పెయిన్‌ దక్షిణ ప్రాంతంలోని ఎయిర్‌ బేస్‌ను ఉపయోగించుకుని ఇరాన్‌పై దాడి చేయాలని ట్రంప్‌ భావించారు. ఇందకు బేస్‌ కావాలని కోరారు. పెద్రో సాంచెజ్‌ దీన్ని స్పష్టంగా ఖండించి, తమ దేశం ఈ ఘర్షణలో పాలుపంచుకోవదని ప్రకటించారు. ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్‌ తీవ్ర వ్యాఖ్యానాలు చేస్తూ ప్రతిస్పందించారు, దీనికి సాంచెజ్‌ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ట్రంప్‌కు గట్టి జవాబు ఇచ్చారు.

Also Read: ఇరాన్ ఉచ్చులో చిక్కుకున్న అమెరికా.. మునిగిపోక తప్పదా?

సాంచెజ్‌ వాదనలు
ఈ యుద్ధాన్ని చట్టవిరుద్ధ దాడిగా, సరైన ఆలోచన, ప్రణాళిక లేని నాయకుడు చేస్తున్న యుద్ధంగా ప్రకటించారు. 2003 ఇరాక్‌పై దాడి కోసం అమెరికా ఇరాక్‌ వద్ద భారీగా ఆయుధాలు ఉన్నాయని ఆరోపించిందని గుర్తు చేశారు. కానీ, తర్వాత ఇది మోసపూరితమని తేలిందన్నారు. కానీ ఉద్ధం కారణంగా ఇరాక్, సిరియా నుంచి వలసలు, చమురు సంక్షోభం, సరఫరా ఆటంకాలు యూరప్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని వాదించారు. రక్తపు ఆటలకు పాల్పడుతున్నారని ట్రంప్‌పై నేరుగా విమర్శించారు.

యూరప్‌ సమగ్ర స్పందన
జర్మన్‌ ఛాన్సలర్‌ స్పెయిన్‌ నిర్ణయానికి మద్దతు తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ 27 దేశాల సమ్మతి అవసరాన్ని నొక్కి చెప్పారు. ఫ్రాన్స్‌ మాత్రం ఒమాన్‌ ఒప్పందం కారణంగా పరోక్ష మద్దతు ఇస్తుంది. మిగిలినవి ఇరాన్‌ ఘర్షణను వ్యతిరేకిస్తూ, డిప్లొమటిక్‌ చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నిరాకరణ అమెరికా లాజిస్టిక్‌ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఇరాన్‌పై దాడులు ఆలస్యమవుతాయి లేదా ప్రాంతీయ మార్గాలపై ఆధారపడతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper