Trump Removes Gulf War Generals: ఐపీఎల్ ప్రారంభానికి గంట ముందు కెప్టెన్‌ను తీసేస్తే ఎలా ఉంటుంది… జట్టు సభ్యులతోపాటు చూసేవారిలోనూ ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఐపీఎల్ కన్నా ఇంట్రోస్ట్‌ంగ్ యుద్ధం గల్ఫ్‌లో జరుగుతోంది. నెల రోజులు దాటింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకులమవుతోంది. మరోవైపు ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా ఇంచు కూడా ముందుకు జరగలేదు. ఇప్పటి వరకు గగనతల దాడులు చేసింది అమెరికా, ఇప్పుడు పదాతి దళాలను ఇరాన్‌లో దించాలని అమెరికా భావిస్తోంది. ఈ కీలక దశలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను తొలగించారు. ఈమేరకు రక్షణ శాఖ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆకస్మికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఏడాది ముందే వేటు
జార్జ్ పదవీకాలం 2027 వరకు ఉంది. కానీ యుద్ధం కీలక దశలో, విజయం అందుకోలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 18 ఏళ్లుగా సైన్యంలో పనిచేస్తున్న జార్జ్ గల్ఫ్ ప్రాంతంపై లోతైన అవగాహన కలిగిన అనుభవజ్ఞుడు. అనేక ఆపరేషన్లు, యుద్ధాల్లో పాల్గొన్న ఆయనను తొలగించడం వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ఆలోచనా విధానానికి, జార్జ్ వ్యూహాలకు మధ్య తేడా రావడమే ఇందుకు కారణం.
మరో ఇద్దరు సీనియర్లపై వేటు
జార్జ్‌తోపాటు జనరల్ డేవిడ్ హాడ్నే, విలియం గ్రీన్‌లను కూడా తొలగించారు. గ్రీన్ ఆర్మీ మత బోధకుడు. యుద్ధాన్ని రక్షణ మంత్రి ‘మతయుద్ధం‘గా అభివర్ణించడాన్ని గ్రీన్ అంగీకరించకపోవడమే ఆయన తొలగింపుకు కారణం. మతపరమైన కోణాన్ని యుద్ధంలోకి లాగడం సరైనది కాదని ఆయన వాదించారు. జార్జ్ స్థానంలో క్రిస్టఫర్ లనెవెను నియమించారు. బైడెన్ కాలం నుంచి పనిచేస్తున్న లనెవెను తొలగించకపోవడం గమనార్హం.
ఇరాన్‌ను ఓడించలేక..
ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఇరాన్‌ను ఓడించలేక ట్రంప్ సైనికాధికారులపై వేటు వేస్తున్నాడు. గతేడాది జనరల్ జఫ్రీ, ఎప్‌స్టీన్ కేసులో క్యాన్‌బొండీ, తర్వాత క్యాష్ పటేల్, హోం సెక్రెటరీలను కూడా మార్చారు. ఈ పరిణామాలు చూస్తుంటే అమెరికా యుద్ధంలో గెలుస్తుందా లేదా అన్న సందేహం కలుగుతోంది. ఇరాన్‌ను ఓడించలేక ఆ కోపాన్ని సైనికాధికారులపై చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మన దేశంలోనూ ఇలాగే..
భారత చరిత్రలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. నెహ్రూ తిమ్మయ్య, మాణిక్‌షా లాంటి వారిని పక్కన పెట్టడం, 1962లో చైనా చేతిలో ఓటమికి దారితీసింది. కానీ ఇందిరాగాంధీ మాణిక్‌షా మాట విని 1971లో బంగ్లాదేశ్ సాధించారు. రాజకీయ నాయకులు సైనిక నిపుణుల మాట వినకపోతే ఫలితం విపరీతంగా ఉంటుందని చరిత్ర చెబుతోంది.
డొనాల్డ్ ట్రంప్ తీరు చూస్తుంటే హిట్లర్ బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. సైనిక నిపుణుల సలహాలు వినిపించుకోకుండా, తన ఆలోచనలను బలవంతంగా అమలు చేయడం ప్రమాదకరం. యుద్ధం కీలక దశలో సైన్యాధిపతులను మార్చడం అమెరికా విజయావకాశాలను మరింత తగ్గిస్తోంది. ఈ పరిణామాలు అమెరికా విదేశీ విధానం, సైనిక వ్యూహాన్ని పునర్విచారించేలా చేస్తున్నాయి. గల్ఫ్ యుద్ధం ఫలితం ప్రపంచ ఆర్థిక, రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
