spot_img
Homeఅంతర్జాతీయంSaudi Arabia And Pakistan: పాకిస్తాన్‌కుకు సౌదీ షాక్‌.. 6.3 బిలియన్‌ డాలర్ల రుణం చెల్లించాలని...

Saudi Arabia And Pakistan: పాకిస్తాన్‌కుకు సౌదీ షాక్‌.. 6.3 బిలియన్‌ డాలర్ల రుణం చెల్లించాలని అల్టిమేటం

Saudi Arabia And Pakistan: పశ్చిమాసియా యుద్ధంతో తీత్రంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌.. రుణాల కోసం అర్థిస్తోంది. ఐఎంఫ్‌ రుణం ఆగిపోయింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రమంలో సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు షాక్‌ ఇచ్చింది. 1980ల్లో ఇరు దేశాల మధ్య కుదిరినరక్షణ ఒప్పందం ప్రకారం, ఒక దేశంపై దాడి జరిగితే మరొక దేశం సహాయం చేయాలి. ఇది మధ్యప్రాచ్య భద్రతకు కీలకం. పాకిస్తాన్ సైనికులు సౌదీలో శిక్షణ ఇచ్చి, రక్షణ సామగ్రి అందించడం జరిగింది. ఇటీవల ఇరాన్‌పై పాకిస్తాన్ డ్రోన్ దాడులు(జనవరి 2026లో జరిగినవి) ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని సౌదీ ఆరోపిస్తోంది.

రుణం తిరిగి చెల్లించాలని ఒత్తిడి..
2022-24 మధ్య సౌదీ పాకిస్తాన్‌కు 6.3 బిలియన్ డాలర్లు (సుమారు 52 వేల కోట్ల రూపాయలు) రుణంగా ఇచ్చింది. ఇందులో 5 బిలియన్ డెపాజిట్లు, 1.3 బిలియన్ డైరెక్ట్ లోన్లు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో (ద్రవ్యోల్బణం 38%, రిజర్వులు 9 బిలియన్ డాలర్లకు తగ్గడం) ఈ డబ్బును ఉపయోగించుకుంది. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఒప్పంద ఉల్లంఘనతో సఖ్యత దెబ్బతింది.

ఆగిన సంప్రదింపులు
సౌదీ అధికారులు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైనికాధిపతి అసిమ్ మునీర్‌లతో సంప్రదింపులు జరపలేకపోతున్నారు. ఫోన్ కాల్స్ స్పందించకపోవడం, డిప్లొమటిక్ చానెళ్లు మూసుకుపోవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఇటీవల రియాధ్‌లో జరిగిన ఓఐసీ సమ్మేళనంలో కూడా ఈ అంశం చర్చకు రాలేదు.

అంతర్జాతీయ ప్రభావాలు
పాకిస్తాన్ ఐఎంఎఫ్‌ ఇచ్చే 7 బిలియన్ డాలర్ల ప్యాకేజీపై ఆధారపడుతోంది. ఈ రుణం తిరిగి చెల్లిస్తే ఇంధన ధరలు పెరగవు. సౌదీ సహాయం లేకపోతే పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతుంది. చైనా, టర్కీ పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వవచ్చు. సౌదీ-ఇరాన్ సంబంధాలు మెరుగుపడుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్య బ్యాలెన్స్ ఆఫ్ పవర్ మారవచ్చు.

సౌదీ ఒత్తిడి నేపథ్యంలో పాకిస్తాన్ క్షమాపణ చెప్పి ఒప్పందాన్ని పునరుద్ధరించవచ్చు లేదా ఐఎంఎఫ్‌, చైనా సహాయంతో రుణాన్ని మేనేజ్ చేయవచ్చు. అయితే, సౌదీ ఆయిల్ సరఫరా తగ్గితే పాకిస్తాన్ ఇంధన సంక్షోభం తీవ్రమవుతుంది. ఈ సంఘటన పాకిస్తాన్ విదేశీ విధానాన్ని ప్రమాదంలోకి నెడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version