Pawan Kalyan Surgery: రాజకీయాల అన్నాక అందరూ విలువలు పాటించరు. విలువలు పాటించేవారు బయటకు చెప్పుకోరు. ఇటువంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు ఆడంబరాలు ఇష్టం ఉండదు. ప్రభుత్వ డబ్బుతో జల్సాలు చేయాలి.. విలాసాలకు పాల్పడాలనే ఆసక్తి ఉండదు. ప్రజాసేవ మాత్రమే ఆయన చేయాలనుకుంటారు. అందువల్లే ఆయన ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే పనులు చేయరు. ప్రభుత్వ ఖజానా లో ఉన్న డబ్బులను సొంతానికి ఖర్చు పెట్టరు.
పవన్ కళ్యాణ్ ముంబై నగరంలో అంబానికి చెందిన హాస్పిటల్లో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఇటీవల కాలంలో ఆయన భుజం నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్లే వైద్యుల సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కొద్దిరోజుల పాటు ముంబై నగరంలో ఉన్నారు. అక్కడ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య స్థితి గురించి తెలుసుకున్నారు. ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని కోరారు.
పవన్ కళ్యాణ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తన పనిలో తాను నిమగ్నం అయిపోయారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బిల్లు మొత్తం తన జేబు నుంచి కట్టారని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నుంచి సొమ్మును వైద్య చికిత్స కోసం వాడుకునే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయలేదు. విమాన ఖర్చులు.. హాస్పిటల్ బిల్లు.. ఇతర వ్యవహారాలు మొత్తం తన జేబు నుంచి ఖర్చు చేసుకున్నారు.
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో వైసిపి వితండవాదం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ చెల్లించిన డబ్బులకు సంబంధించిన బిల్లులు బయటపెట్టాలని డిమాండ్ చేయడం ప్రారంభించింది. పవన్ కళ్యాణ్ షో చేస్తున్నారని.. చివరికి తన భుజానికి సంబంధించిన శస్త్ర చికిత్సను కూడా ప్రచారం కోసం వాడుకుంటున్నారని ఆరోపించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు వైసీపీ మీద మండిపడుతున్నారు. ఇంతకంటే వైసీపీ దిగజారిపోదని.. ఆరోపిస్తున్నారు. వైసిపి తీరు మారదని.. జన సేన నాయకులు అంటున్నారు. వైసీపీ నేతల మాదిరిగా పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వ సొమ్మును దోచుకునే అలవాటు లేదని.. అక్రమాలకు పాల్పడే కర్మ లేదని జనసేన నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
