SS Rajamouli: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే దానిపై ఏ రేంజ్ లో ప్రచారం జరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొంతమంది ఆయన యానిమేషన్ చిత్రం చేయబోతున్నారని ప్రచారం చేయగా, మరికొంతమంది మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు ప్రచారం చేశారు. మరికొంతమంది అయితే ఈ రెండు కాదు , ఆయన మహాభారతం సిరీస్ ని మొదలు పెట్టబోతున్నారు అంటూ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న మరో వార్త అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
రాజమౌళి తన చిత్రాన్నితమిళ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య తో చేయబోతున్నట్టు కోలీవుడ్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై తమిళ మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో కూడా ప్రత్యేక కథనాలు ప్రసారం అయ్యాయి. కానీ రాజమౌళి నుండి కానీ , సూర్య వైపు నుండి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాజమౌళి సంగతి తెలిసిందే. తానూ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయ్యేంత వరకు , తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నారు అనే విషయాన్నీ తెలియచేయరు కాబట్టి. ఇది నిజమో కాదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. గతం లో కూడా రాజమౌళి , సూర్య కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉంది. మగధీర చిత్రాన్ని ముందుగా సూర్య తోనే చెయ్యాలని అనుకున్నారు రాజమౌళి.
కానీ అప్పట్లో అంత బడ్జెట్ ని ఖర్చు చేసే ధైర్యం ఏ నిర్మాత కి లేకపోవడం తో ఈ సినిమా కుదర్లేదు. నిర్మాత అల్లు అరవింద్ ధైర్యం చేసి , రామ్ చరణ్ తో ఈ సినిమాని తీశారు. ఆ తర్వాత ఫలితం తెలిసిందే. వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా కూడా చెయ్యాలని అనుకున్నారు. అదే #RRR చిత్రం. ముందుగా ఈ సినిమాని రామ్ చరణ్ , సూర్య కాంబినేషన్ లో తీయాలని అనుకున్నారట. కానీ రామ్ చరణ్ , ఎన్టీఆర్ అయితే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన రాజమౌళి కి రావడంతో మరోసారి ఈ కాంబినేషన్ మిస్ అయ్యింది. కనీసం ఈసారైనా ఈ కాంబినేషన్ కుదురుతుందో లేదో చూడాలి. రీసెంట్ గానే సూర్య ‘కరుప్పు’ చిత్రం తో సూర్య భారీ కం బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో ఆయన హీరో గా నటించిన ‘విశ్వనాధ్ & సన్స్’ అనే చిత్రం విడుదల కానుంది.
