Moto G77 Power: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పుడు ‘బ్యాటరీ వార్’ నడుస్తోంది. ఒకప్పుడు సాధారణ బ్యాటరీ ఉంటే చాలు.. అనుకునేవాళ్లు ఇప్పుడు అత్యధిక ఎనర్జీ ఉండే బ్యాటరీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. రోజూవారీ పనులతో పాటు మొబైల్ పై ఎక్కువగా ఆధారపడడంతో ఎక్కువసేపు బ్యాటరీ ఉండే ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా భారీ బ్యాటరీతో మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇందులో భాగంగా మోటరోలా, రియల్ మీ కంపెనీలు ఈ విషయంలో పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితె..
Motorola కంపెనీ ఇటీవలే మోటో G77 పవర్ మొబైల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ లో 7000mAh భారీ బ్యాటరీని ఉంచారు. అయితే ఈ ఫోన్ క పోటీగా రియల్‌మీ Realme Narzo 100x అనే మోడల్ ను 8000mAh భారీ బ్యాటరీతో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో ఏది కొనాలి? అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ రెండు ఫోన్లకు ఉన్న వ్యత్యాసాలు చూస్తే ఏది కొనాలో అర్థమవుతంది.
మోటో G77 పవర్
మోటోరోలా ‘మోటో G77 పవర్’ జూలై 8న విడుదలయింది. బడ్జెట్ విభాగంలో ఇది ఒక పవర్‌హౌస్ అని చెప్పొచ్చు. ఇందులో 7,000mAh భారీ బ్యాటరీ ఉంచార. దీనిని సాధారణంగా వినియోగిస్తే సుమారు 2 రోజుల పాటు పవర్ బ్యాక్ వస్తుంది. ఈ బ్యాటరీకి 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండడం వల్ల ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే దీని డిస్‌ప్లే, కెమెరా కూడా అదిరిపోయాయి. ఇందులో 6.72 అంగుళాల FHD ప్లస్ గా ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉండడం వల్ల స్క్రోలింగ్ స్మూత్ గా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో ప్రీమియం ఫోన్లలో ఉండే 50MP Sony LYT-600 మెయిన్ ఉంది. అలాగే 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది క్లారిటీతో కూడిన ఫోటోలు అందిస్తంది. 2K వీడియో రికార్డింగ్ కూడా ఉండడంతో ఫొటోగ్రఫీ వారికి అనుగుణంగా ఉంటుంది. అలాగే ఇందులో MediaTek Dimensity 6400 ప్రాసెసర్ ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు చేయడానికి అనుకూలంగా ఉంది. ఈ వేరియంట్లతో దీనిని రూ. 25,999 తో విక్రయిస్తున్నారు.
Realme Narzo 100x
మరోవైపు జూలై 15న లాంచ్ అయిన ‘Realme Narzo 100x’ మొబైల్ లో ఏకంగా 8,000mAh Titan బ్యాటరీని అమర్చారు. మొబైల్ హిస్టరీలోనే ఇది అతిపెద్ద బ్యాటరీలలో ఒకటి. కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. ఇది సింగిల్ ఛార్జ్‌పై 3 రోజుల పాటు బ్యాకప్ ఇస్తుంది. దీనికి తోడు మోటో కంటే వేగంగా ఛార్జ్ అయ్యే 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో ఉంది. 8.8mm స్లిమ్ డిజైన్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉండడంతో ఆసక్తికరంగా ఉంది. ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ను చేర్చారు. అలాగే ఇందులో 50MP కెమెరా ఉన్నాయి. దీని ప్రారంభ ధర కేవలం రూ. 20,999 కావడం విశేషం.
ఏది కొనాలి?
బడ్జెట్ రూ. 21 వేల లోపు అనుకుంటే.. అత్యధిక బ్యాటరీ కావాలని అనుకునేవారికి (8000mAh) Realme Narzo 100x బెస్ట్ ఫోన్. ఇది వేగవంతమైన ఛార్జింగ్ కూడా ఉండడంతో బిజీగా ఉండేవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే బ్యాటరీతో పాటు డిస్‌ప్లే క్వాలిటీ (FHD+), బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్, సెల్ఫీ కెమెరా కావాలనుకుంటే.. మోటో G77 పవర్ వైపు వెళ్లొచ్చు. అయితే ఈ ఫోన్ ధర రియల్ మీ కంటే కాస్త ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయడం మంచిది.
