Pakistan Petrol Price 500 Rupees: ఒక దేశ అభివృద్ధి అక్కడ ఉన్న ఇంధన ధరల ఆధారంగా చెప్పవచ్చు అంటారు ఆర్థిక విశ్లేషకులు. ఈ లెక్కన చూసుకుంటే పాకిస్తాన్ స్థాయి అట్టడుగు కంటే ఇంకా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల కాలంలో అక్కడ ప్రభుత్వం ధరలను నిరంతరం పెంచుతూనే ఉంది. మధ్య ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని కారణంగా చూపుతూ పాకిస్తాన్ దేశం ఇష్టానుసారంగా ఇంధన ధరలను పెంచేసింది.
తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. డీజిల్ ధరలో 54.9 శాతం, పెట్రోల్ ధరలో 42.7 శాతాన్ని పెంచినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. తింటూ అక్కడ లీటర్ డీజిల్ ధర 520.35 పాకిస్తాన్ రూపాయలు, పెట్రోల్ ధర లీటర్ 458.40 పాకిస్తాన్ రూపాయలుగా పెంచింది.. ఇంధన ధరలను పెంచడం ఇది రెండవసారి.
ఇలా ధరలను పెంచడం వల్ల పాకిస్తాన్లో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడ ప్రజల జీవన స్థితిగతులను ఇంధన ధరలు పూర్తిగా మార్చే ప్రమాదం కనిపిస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన ధరలు పెంచక తప్పడం లేదని మాలిక్ చెబుతున్నారు.
పాకిస్తాన్ దేశం సౌదీ అరేబియా, యూఏఈ నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నది.. అయితే గతంలో తమ సబ్సిడీ ఇచ్చామని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పాకిస్తాన్ మంత్రి చెప్పడం విశేషం.. పాకిస్తాన్లో ధరల పెరుగుదల నేపథ్యంలో విశ్లేషకులు ఆ దేశ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ భారత్.. ఇంధన ధరలను పెంచలేదని.. గ్యాస్ సరఫరా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నదని.. కానీ ఈ సోయి పాకిస్తాన్ దేశానికి లేదని మండిపడుతున్నారు. కనీసం పెట్రోల్ ధరల విషయంలో ప్రజల మీద కనికరం చూపలేని పాకిస్తాన్ ప్రభుత్వం.. భారతదేశంతో యుద్ధం ఎలా చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు..
పాకిస్తాన్ పరిపాలకులు భారత్ మీద దాడి చేస్తామని అంటున్నారు. కానీ.. ముందు ఆ దేశంలో చమురు ధరలు ఎలా ఉన్నాయో వాళ్లు చూసుకోవాలి. అంతేగాని భారత్ మీద దాడి చేస్తామని బెదిరిస్తే.. భారత్ మాత్రం చూస్తూ ఊరుకుంటుందా.. ఆపరేషన్ సిందూర్ వల్ల ఏం జరిగిందో తెలియదా అంటూ అంతర్జాతీయ విశ్లేషకులు పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.
