https://oktelugu.com/

Donald Trump : అమెరికాలోనూ రెడ్‌బుక్‌ రాజకీయం.. శత్రువుల లిస్ట్‌ రెడీ చేస్తున్న ట్రంప్‌!

రెడ్‌ బుక్‌.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న సమయంలో టీడీపీ నేత లోకేష్‌ రెడ్‌ బుక్‌ పేరు తెచ్చారు. టీడీపీ నేతలను వేధించిన నాటి అధికార వైసీపీ నేతులు, పోలీస్‌ అధికారులు, ఇతర ప్రభుత్వం అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 9, 2024 / 05:44 PM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump :  రెడ్‌ బుక్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అమలువుతున్నట్లు ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తోంది. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం పక్కన పెట్టి రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇలా రెడ్‌ బుక్‌ అనేది కొన్ని నెలలుగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ రెడ్‌ బుక్‌ రాజకీయం త్వరలో అమెరికాలోనూ ప్రారంభం కాబోతోందని అంటున్నారు విశ్లేషకులు. ఇటీవల జరిగిన ఎన్నిల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తన శత్రువుల పేరుతో రెడ్‌బుక్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఏ విషయాన్ని అంత ఈజీగా వదలని ట్రంప్‌ అధికారం చేపట్టగానే రెడ్‌బుక్‌లో పేర్లు ఉన్నవారిని ఏం చేయబోతున్నారన్నదానిపై అగ్రరాజ్యంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ట్రంప్‌ తాను ఏం చేయలన్నా.. దానిని ముక్కు సూటిగా, కుండ బద్ధలు కొట్టినట్లుగా చెబుతారు. అలాంటి ట్రప్‌ ఇప్పుడు శత్రువుల జాబితా రెడీ చేయడం ఉత్కంఠ రేపుతోంది. పాలిటిక్స్‌ నుంచి మీడియా, సినిమా వరకు ఎవరినీ వదిలేదని లేదని, రివేంజ్‌కు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. మరి ట్రంప్‌ ఎవరెవరినీ టార్గెట్‌ చేస్తారో చూద్దాం.

    అవమానాన్ని భరించరు..
    ట్రంప్‌ ఏ విషయాన్ని ఈజీగా వదలరు. ఇప్పుడు శత్రువలను కూడా వదిలేలా లేదు. రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే రివేంజ్‌ పాలిటిక్స్‌ మొదలు పెడతారని అంటున్నారు. ఎవరైనా తనను అవమానిస్తే ట్రంప్‌ అస్సలు సహించరు. గతంలో బారక్‌ ఒబామా తనను అవమానించారని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని మొదటి సారి అధ్యక్షుడు అయ్యాడు. తాజాగా రెండోసారి అధికారంలోకి వచ్చారు.

    రెడ్‌ బుక్‌లో వీరి పేర్లు..
    ఇక తాజాగా ట్రంప్‌ రెడ్‌బుక్‌లో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తోపాటు ఫెడరల్‌ అధికారులు, స్పీకర్లు, విదేశాలు చెందిన కొంద మంది ప్రధానులు, అధ్యక్షుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ చెప్పిన ప్రతీ మాట… చేసిన ప్రతీ ఆరోపణ ఇప్పుడు వాషింగ్‌టన్‌ వీధుల్లో రీసౌండ్‌ వస్తోందట.