https://oktelugu.com/

Naga Chaitanya-Samantha : నాన్ స్టాప్ ఫోన్ కాల్స్..టార్చర్ తట్టుకోలేక సమంత ఫోన్ నెంబర్ ని బ్లాక్ చేసిన నాగ చైతన్య..అసలు ఏమైందంటే!

సుమారుగా నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసి , ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాకనే వీళ్లిద్దరు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వీళ్లిద్దరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాతనే కొన్ని అపార్థాలు కారణంగా విడిపోవాల్సి వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 05:12 PM IST

    Naga Chaitanya-Samantha

    Follow us on

    Naga Chaitanya-Samantha :  సమంత, నాగ చైతన్య కి సంబంధించిన క్యూట్ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవడానికి అభిమానులు అమితాసక్తిని చూపిస్తూ ఉంటారు. వాళ్లిద్దరూ విడిపోయి చాలా కాలం అవుతున్నప్పటికీ కూడా, ఇప్పటికీ వీళ్లిద్దరికీ సంబంధించి సోషల్ మీడియా లో ఎదో ఒక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తూనే ఉంటుంది. మళ్ళీ వీళ్లిద్దరు కలిసిపోతే బాగుంటుందని అందరూ కోరుకున్నారు కానీ, అది ఈ జన్మకి సాధ్యం కాదని ఇటీవలే శోభిత ని నిశ్చితార్థం చేసుకున్న రోజే అందరికీ అర్థమైంది. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి లవ్ స్టోరీ కూడా రెగ్యులర్ గా మనం చూసే ప్రేమ జంటల లవ్ స్టోరీ లాగానే ఉంటుందట. ఆటో నగర్ సూర్య చిత్రం నుండి వీళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. సుమారుగా నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసి , ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాకనే వీళ్లిద్దరు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వీళ్లిద్దరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది కానీ, ఆ తర్వాతనే కొన్ని అపార్థాలు కారణంగా విడిపోవాల్సి వచ్చింది.

    ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్న రోజుల్లో వీళ్ళ మధ్య జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒకరోజు నాగ చైతన్య మూవీ షూటింగ్ లో ఉండగా, సమంత పదే పదే ఫోన్ కాల్స్ చేసి విసుగు పుట్టించిందట. కట్ చేస్తున్నా కూడా ఆమె ఫోన్లు చేయడం ఆపలేదట. దీంతో విసుగెత్తిపోయిన నాగ చైతన్య ఆమె నెంబర్ ని కాసేపటి వరకు బ్లాక్ లో పెట్టాడట. దీంతో చిర్రెత్తిపోయిన సమంత నేరుగా నాగ చైతన్య షూటింగ్ లొకేషన్ కి వచ్చి, అతన్ని పక్కకి పిలిచి గొడవ పెట్టుకోబోయింది అట. అంత కోపం గా వచ్చిన ఆమె, నాగ చైతన్య ని చూసిన వెంటనే కోపాన్ని మర్చిపోయిందట. ఆ తర్వాత ఇద్దరు మనస్ఫూర్తిగా మాట్లాడుకొని, షూటింగ్ అయిపోయాక కలిసి వెళ్లారట. వింటుంటేనే ఎంతో క్యూట్ గా అనిపిస్తుంది కదూ!, కానీ ఏమి చేస్తాం, వాళ్ళిద్దరి తలరాతలు అలా రాసుంది.

    ఇది ఇలా ఉండగా కెరీర్స్ విషయం లో వీళ్లిద్దరు ఇప్పుడు ఫుల్ జోష్ మీద ఉన్న సంగతి తెలిసిందే. సమంత నుండి రీసెంట్ గా ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ‘తండేల్’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేస్తున్నాడు. అల్లు అరవింద్ నిర్మాతగా, సాయి పల్లవి హీరోయిన్ గా, చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తారీఖున విడుదల కాబోతుంది. మరోపక్క డిసెంబర్ 4 వ తేదీన నాగ చైతన్య ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ని వివాహం చేసుకోబోతున్నాడు. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.