Homeఅంతర్జాతీయంTrump Iran War Latest Update: యుద్ధం ముగిసిందని ట్రంప్ చేతులెత్తాడు.. ఇరాన్ ఓకే అంటేనే...

Trump Iran War Latest Update: యుద్ధం ముగిసిందని ట్రంప్ చేతులెత్తాడు.. ఇరాన్ ఓకే అంటేనే డీల్ కుదిరేది..

Trump Iran War Latest Update: కొద్ది రోజులుగా సాగుతున్న అమెరికా ఇరాన్ యుద్దం ప్రపంచానికి కంటి మీద కనుకు లేకుండా చేసింది. ముఖ్యంగా హర్ముజుజలసంధి మీదుగా ముడి చమురు రవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మనదేశంలో అయితే ఏకంగా నాలుగు సార్లు గ్యాస్, ప్రీమియం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయి. ఫలితంగా వినయోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ద్రవ్యోల్భణం కూడా అదుపు చేయలేని స్థాయిలో పెరిగింది.

యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు తారుమరయ్యాయి. అంతటి అమెరికాలో ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. అమెరికా పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ తన కాపలా కుక్క పాకిస్థాన్ తో తెరపైకి శాంతి ఒప్పందాన్ని తీసుకొచ్చింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఇరాన్, అమెరికా మధ్యశాంతి చర్చలు జరిగినప్పటికీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. దీంతో పాకిస్థాన్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇది జరిగిన తర్వాత రెండు దేశాలు కొద్ది రోజుల పాటు కాల్పుల విరమణను పాటించాయి. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు.. కాల్పులు మొదలయ్యాయి.

యుద్ధంవల్ల రెండు దేశాలకు నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలో.. ఈ వార్ ను విరమించాలనే ప్రతిపాదన వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందేనని ఇరాన్ ను షరతు విధించారు. దానికి ఇరాన్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత అనేక రకాలుగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి యుద్ధాన్ని విరమిస్తున్నట్టు అమెరికా, ఇరాన్ ప్రకటించాయి. వాస్తవానికి ఇరాన్ తో యుద్ధం చేయలేక ట్రంప్ చేతులెత్తేశాడని ఇరాన్ మీడియారాస్తోంది. ఇజ్రాయిల్,అమెరికా మూకుమ్మడిగా దాడులు చేసినప్పటికీ ఇరాన్ వెన్ను చూపించలేదని అక్కడి మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

యుద్ధం ముగిసిందని ట్రంప్ చెబుతున్నప్పటికీ అసలైన్ ట్విస్ట్ ఇరాన్ ఇచ్చింది. ఇరాన్ దేశానికి చెందిన 24 బిలయన్ డాలర్ల ఆస్తుల వ్యవహారం ఇంకా తేలలేదు. డీల్ కు ముందే 12 బిలయన్ డాలర్ల ఆస్తుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇరాన్ మీడియా చెబుతోంది. ఇరాన్ ఒప్పందాన్ని అమలు చేయకుండా ఆ ఆస్తులను వదిలేది లేదని అమెరికా చెబుతోంది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం మొదలవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలయితే పరిస్థితి మొదటికి వస్తుంది. అదే గనక జరిగితే ప్రపంచం మరింత ఆర్థిక ఒత్తిడిలోకి వెళ్లడం ఖాయం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version