HomeNewsWork From Home Policy India: ఉద్యోగులు ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలి.. విదేశాలకు వెళ్లొద్దు

Work From Home Policy India: ఉద్యోగులు ఇంటి దగ్గరి నుంచే పనిచేయాలి.. విదేశాలకు వెళ్లొద్దు

Work From Home Policy India: కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోమ్ అనే విధానం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాలం మారుతున్నా కొద్దీ పరిస్థితులు క్రమేపీ చక్కపడ్డాయి. మళ్లీ ఇప్పుడు కరోనా ను మించి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇరాన్, అమెరికా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగిపోతున్నాయి. చమురు సరఫరా కూడా దారుణంగా ఉంటున్నది. హర్మూజ్ జలసంధిలో ఆంక్షల వల్ల చమురు సరఫరాలో తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పందించారు. దేశవ్యాప్తంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పొదుపు చర్యలు పాటించాలని హితవు పలికారు. బంగారం కొనుగోలు చేయకూడదని, అంతర్జాతీయంగా ప్రయాణాలు సాగించొద్దని.. సూచించారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు కలిగించాయి. బంగారం వినియోగాన్ని తగ్గించేందుకు, చమురు వాడకాన్ని నియంత్రించేందుకు కేంద్రం సుంకాలు, ధరలు పెంచడం మొదలుపెట్టింది. చమురు మీద నాలుగు సార్లు ధరలు పెంచింది. ఇంకా ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారం మీద సుంకం పెంచిన నేపథ్యంలో ధరలు ఆకాశమార్గంలో విహరిస్తున్నాయి.

నరేంద్రమోడీ సూచనల నేపథ్యంలో దేశీయంగా అనేక సంస్థలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనదేశంలో ఆటోమోబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ కంపెనీ తన ఉద్యోగుల విషయంలో కీలక ప్రకటన చేసింది.ఆన్ ఫీల్డ్ లో పని చేయాల్సిన అవసరం లేదని మారుతీ సుజుకీ కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించింది. విదేశీ పర్యటనలు చేసే ఉద్యోగులు కేవలం కంపెనీ అవసరాల కోసం మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశాలు మాత్రమే కాదు, దేశీయంగా కూడా ప్రయాణాలను తగ్గించుకోవాలని ఉద్యోగులకు స్పష్టం చేసింది. కేవలం ఆన్ లైన్ విధానంలో సమావేశాలకు మాత్రమే హాజరు కావాలని సూచించింది.

‘పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. చక్కబడేవరకు జాగ్రత్తగా ఉండాలని మా ఉద్యోగులకు చెబుతున్నాం. పెట్రోలియం వాడకం తగ్గించాలి. అవసరం ఉంటేనే ప్రయాణాలు చేయాలి. ఉద్యోగులు ఇంటివద్ద నుంచి పని చేసే సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. అందువల్లే ఈ నిర్ణయాలను తీసుకున్నామని’ మారుతీ సుజుకీ నిర్వాహకులు ప్రకటించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper
Exit mobile version