US Presidential Elections: అగ్రరాజ్యం అమెరికా.. ప్రపంచ దేశాలకు పెద్దన్న.. దాదాపు మెజారిటీ దేశాలు అమెరికాపై ఆధారపడే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా అమెరికా ఎన్నికలవైపే చూస్తోంది. అధ్యక్షులుగా ఎవరు ఎన్నికవుతారనే ఉత్కంఠ అమెరికన్లతోపాటు ప్రపంచ దేశాల్లోనూ నెలకొంది. ప్రపంచమంతా అమెరికాను ఫాలో అవుతుంటే.. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాత్రం.. భారత ప్రధాని నరేంద్రమోదీని ఫాలో అవుతున్నారు. ఎన్నికల్లో అమెరికన్లను ఆకట్టుకునే విషయంలోగానీ, వేషధారణలోగానీ, ట్రంప్ మోదీనే ఫాలో అవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యం..
నరేంద్రమోదీ భారత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. పదేళ్లుగా ఆయన ఇదే సూత్రం అవలంబిస్తున్నారు. అందుకే దేశ ప్రజలు వరుసగా బీజేపీకి పట్టం కట్టారు. దేశం ఫస్ట్.. అనే నినాదమే బీజేపీ బలం. ఇక హిందూ వాదం కూడా బీజేపీని గెలిపిస్తోంది. బీజేపీ ప్రభావం పెద్దగా లేని దేశాలు కూడా ప్రస్తుతం బీజేపీ నినాదాలకు ఆకర్షితులవుతున్నాయి. అందుకే బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపిస్తున్నారు. దీనిని గుర్తించిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కూడా మోదీలాగనే నేషన్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారమంతా ఆయన దేశం ప్రజల గురించే స్వార్థంగా ఆలోచిస్తున్నారు. తాను ఆధికారంలోకి వస్తే వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని స్పష్టం చేశారు. చివరకు భారతీయ ఉద్యోగులను కూడా.. అమెరికా ఉద్యోగాల దోపిడీ దారులుగా అభివర్ణించారు. అచ్చం మోదీలా ట్రంప్ కూడా అమెరికా ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మోదీ తరహాలోనే యుద్ధాలను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికా సంపదను ఇతర దేశాలు చేసే యుద్ధం కోసం ఖర్చు చేయడాన్ని ఆయన తప్పు పడుతున్నారు.
డ్రెస్సింగ్‌లోనూ..
ఇక డొనాల్డ్ ట్రంప్ తన డ్రెస్సింగ్ విషయంలోనూ మోదీనే ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో దాదాపు అందరూ సూట్ ధరిస్తారు. కానీ ట్రంప్ మాత్రం ఎన్నిల ప్రచారంలో కాషాయ రంగు చొక్కా ధరించారు. దీనిపై మోదీ తరహాలో కోట్ వేసుకున్నారు. పక్కన మస్క్ కూడా కాషాయ రంగు కుర్తా ధరించి నిల్చున్నారు. ఇప్పుడు ఈ పొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధ్యక్ష ఎన్నిల వేళ.. భారతీయ అమెరికన్లను ఆకట్టుకునేందుకే మోదీ టీం ఈ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తుందన్న ప్రచారం జరగుతోంది. ఇక ఈ ఫొటోపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. ట్రంప్‌ను మోదీగా, మస్క్‌ను యోగిగా పోలుస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇద్దరూ మిత్రులే..
ఇదిలా ఉంటే.. డోనాల్డ్ ట్రంప్, నరేంద్రమోదీ మంచి మిత్రులు 2016 అధ్యక్ష ఎన్నిల్లో మోదీ డొనాల్డ్ ట్రంప్ తరఫున అమెరికాలో ప్రచారం కూడా చేశారు. ఇక ట్రంప్ కూడా మోదీని తన మిత్రుడిగా చాలాసార్లు ప్రకటించారు. ఇద్దరూ కలిసి మెరికాలో, భారత్‌లో 2018లో కార్యక్రమాలు నిర్వహించారు. భారత్‌లో నమస్తే ట్రంప్ పేరుతో కార్యక్రమం నిర్వహించగా, అమెరికాలో మోదీ కోసం టెక్సాస్‌లో ‘‘హౌడీ మోదీ’’ పేరుతో పెద్ద సభ ఏర్పాటు చేశారు ట్రంప్. ఇక ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్‌తో బలైమన బంధం ఏర్పడింది. కానీ, ఈసారి ఆయన పూర్తిగా అమెరికా నినాదంతోనే ఎన్నికల ప్రచారం చేశారు.