https://oktelugu.com/

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో ‘లకడీ కా పూల్’..అడ్డంగా బుక్ అయిపోయిన నభీల్,పృథ్వీ,రోహిణి..అసలు ఏమైందంటే!

ముందుగా గార్డెన్ ప్రాంతం లో మూడు సూట్ కేసులు పెడుతాడు బిగ్ బాస్. వీటిని నభీల్, రోహిణి, పృథ్వీ తీసుకుంటారు. ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ లివింగ్ రూమ్ లోకి పిలిచి, గార్డెన్ ప్రాంతంలో పెట్టిన సూట్ కేసులను తీసుకొని చాలా పెద్ద రిస్క్ చేసారు అని అంటాడు బిగ్ బాస్.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 09:12 AM IST

    Bigg Boss Telugu 8(199)

    Follow us on

    Bigg Boss Telugu 8: గత వారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన టాస్కులు ఎంత రసవత్తరంగా సాగాయో మన కళ్లారా చూసాము. ఇన్ని రోజులు ఎదురు చూసింది ఇలాంటి టాస్కుల కోసమే కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా చెప్పుకొచ్చారు. ఈ వారం కూడా అదే ఫైర్ మీద టాస్కులు జరుగుతాయని ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే కంటెస్టెంట్స్ మధ్య ఒక ఆసక్తికరమైన టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ముందుగా గార్డెన్ ప్రాంతం లో మూడు సూట్ కేసులు పెడుతాడు బిగ్ బాస్. వీటిని నభీల్, రోహిణి, పృథ్వీ తీసుకుంటారు. ఆ తర్వాత బిగ్ బాస్ అందరినీ లివింగ్ రూమ్ లోకి పిలిచి, గార్డెన్ ప్రాంతంలో పెట్టిన సూట్ కేసులను తీసుకొని చాలా పెద్ద రిస్క్ చేసారు అని అంటాడు బిగ్ బాస్.

    అయితే ఈ సూట్ కేసులు తీసుకున్న నభీల్, రోహిణి, పృథ్వీ మధ్య కొన్ని టాస్కులు నిర్వహిస్తాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ పేరు ‘లాకిడీ కా పూల్’, ఈ టాస్కులో రోహిణి గెలుస్తుంది. ఆ తర్వాత రోహిణి ని బిగ్ బాస్ సూట్ కేసు తెరవమని చెప్తాడు. తెరిచిన తర్వాత అందులో 1,80,000 రూపాయిలు ఉంటుంది. ఇది ప్రైజ్ మనీ కి యాడ్ అవుతుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రోహిణి ని ఈ సూట్ కేసు ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారు అని అడగగా, రోహిణి ప్రేరణ కి ఇస్తుంది. అదే విధంగా బిగ్ బాస్ ‘షేప్ యువర్ ఫ్యూచర్’ అనే టాస్క్ నిర్వహిస్తాడు. ఈ టాస్క్ లో నభీల్ గెలుస్తాడు. ఆ తర్వాత సూట్ కేసు తెరిచి చూడగా, అందులో 1,25,000 రూపాయిలు ఉంటుంది. తర్వాత ఆ సూట్ కేసు ని నభీల్ యష్మీ కి ఇస్తాడు. ఇక చివరికి పృథ్వీ విషయం లో ఏమి అవుతాడో తెలియాల్సి ఉంది.

    అసలు బిగ్ బాస్ గెలిచిన వాళ్ళను సూట్ కేసు మీకు నచ్చిన వాళ్లకు ఇవ్వమని ఎందుకు అన్నాడు?, తీసుకున్న వాళ్ళతో బిగ్ బాస్ ఎలాంటి గేమ్స్ ఆడిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం గత వారం లో లాగా ఫిజికల్ టాస్కులు పెద్దగా ఉండేలా అనిపించడం లేదు. ఎక్కువగా బుర్రకి సంబంధించిన టాస్కులే ఇచ్చేట్టు ఉన్నాడు. అదే కనుక జరిగితే టేస్టీ తేజా బాగా హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ గేమ్ లో గెలిచిన హౌస్ మేట్ నామినేషన్స్ నుండి బయటకి కూడా రావొచ్చు అట. ఎలాగో ఈ వారం గంగవ్వ ని తీసేయాలని బలంగా బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యింది. కాబట్టి గేమ్ కి నామినేషన్స్ కి లింక్ చేస్తే చూసే ఆడియన్స్ కి రసవత్తరంగా ఉంటుందని ఇలా ప్లాన్ చేశారట. మరి ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.