Homeవింతలు-విశేషాలుMysore silk saree price 250000: ఒక్కో చీర 2,50,000.. తెల్లవారుజాము నుంచే క్యూలో.. ఏమిటా...

Mysore silk saree price 250000: ఒక్కో చీర 2,50,000.. తెల్లవారుజాము నుంచే క్యూలో.. ఏమిటా ప్రాంతం, ఎందుకా ప్రత్యేకత?

Mysore silk saree price 250000: చీరలు అంటే ఆడవాళ్లకు చాలా ఇష్టం. ముఖ్యంగా పట్టు చీరలు అంటే మరింత ఇష్టం. పట్టుచీరలలో నేత కార్మికులు నేసినవి అంటే మరింత ఇష్టం. అందువల్లే తెలంగాణ రాష్ట్రంలో గద్వాల, పోచంపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడ, ధర్మవరం ప్రాంతాలలో నేసే చీరలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇతర రాష్ట్రాలలో కంచి, బనారస్, ఇతర రకాల పట్టుచీరలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.

పట్టు చీరలను ఆడవాళ్లు అమితంగా ఇష్టపడుతుంటారు. నేటి ఫ్యాషన్ కాలంలో కూడా పట్టు చీరలకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. పైగా ఆడవాళ్లు రకరకాల వెరైటీలను కోరుకుంటున్నారు. ఇటీవల కాలంలో బంగారంతో పట్టు చీరలను నేస్తున్నారు. పట్టుచీరల కోసం ఆడవాళ్లు ఎంత దూరమైనా వెళ్తారని అంటారు. అలాంటిది ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఆడవాళ్లకు పట్టు చీరలపై ఉన్న ప్రేమను చూపిస్తున్నాయి..

మనదేశంలో ఐఫోన్ లో కొత్త మోడల్స్ విడుదలైనప్పుడు.. కొత్త సినిమాలు విడుదలైనప్పుడు భారీగా ప్రజలు క్యూలో ఉంటారు. కానీ కర్ణాటక రాష్ట్రంలో పట్టుచీరల కోసం ఆడవాళ్లు ఉదయమే క్యూలో ఉండడం మొదలుపెట్టారు. తెల్లవారుజామున భారీగా తరలివచ్చిన ఆడవాళ్లు దాదాపు కిలోమీటర్ల కొలది క్యూలో ఉన్నారు. ఆ క్యూలో కూర్చొని.. తమ వంతు వచ్చేవరకు ఎదురుచూసి తీసుకున్నారు.

ఆ మహిళలు ఎదురుచూసింది మైసూర్ పట్టు చీరల కోసం. మైసూర్ పట్టు చీరలలో కొన్ని రకాల ధర ఏకంగా 2,50,000 వరకు ఉంటుందట. మైసూర్ పట్టు చీరలకు చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటికి కూడా కార్మికులు అదేవిధంగా చీరలను నేస్తున్నారు. అయితే ఈ చీరలు కేవలం మైసూర్ ప్రాంతంలో మాత్రమే తయారవుతాయి. అక్కడ లభించే పట్టు.. కార్మికులు ఉపయోగించే పదార్థాలు.. ఇవన్నీ కూడా ఆచీరలకు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ పట్టు చీరల కోసం కేవలం మహిళలు మాత్రమే కాదు, యువతులు కూడా క్యూలో ఉండడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by ET NOW (@etnow)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular