Homeఅంతర్జాతీయంTop Nations: అగ్రరాజ్యం.. సామాజిక పతనం..

Top Nations: అగ్రరాజ్యం.. సామాజిక పతనం..

Top Nations: అగ్రరాజ్యాలు సామాజికంగా పతనం అవుతన్నాయి. ఆధిపత్యం కోసం విలువలను వదిలేస్తున్నాయి. అతి ఉదారతతో ఆర్థికంగా, సామాజికంగా పతనం అవుతున్నాయి పాశ్చాత్య దేశారు. ఇందుకు బీజం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే పడింది.

మొదటి ప్రపంచ యుద్ధంతో..
ఐరోపా దేశాల మధ్య మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దీంతో స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఉత్పత్తి కర్మాగారాలు దెబ్బతిన్నాయి. యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా ఎగుమతులను పెంచుకుంది. ఉత్పత్తి రంగాన్ని బలోపేతం చేసుకుంది. తర్వాత ఐరోపా దేశాలు కోలుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవడం ప్రారంభించాయి. అదే సమయంలో అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 1929 నాటికి ఆమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారింది.

రెండో ప్రపంచ యుద్ధం..
ఇదే సమయంలో మళ్లీ రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. అక్కడి పారిశ్రామిక రంగం దెబ్బతినడంతో మళ్లీ అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. పారిశ్రామిక రంగం పుంజుకుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసన తర్వాత బానస దేశాలకు స్వాతంత్య్రం ఇవ్వాల్సిన పరిస్థితి. దీంతో పన్నులు తగ్గడం, యుద్ధం తో నష్టం కారణంగా ఐరోపా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మళ్లీ అమెరికాపై ఆధారపడ్డాయి.

ఐరోపా దేశాలు కోలుకోకుండా..
ఇక్కడే అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఐరోపా దేశాలు మళ్లీ పుంజుకోకుండా దొడ్డిదారిన ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టింది. అవసరం ఉన్నవి లేని హక్కుల కోసం సమ్మెలను ప్రోత్సహించింది. కానీ, అదే ఉద్యోగులకు బాధ్యతలు ఇవ్వలేదు. దీంతో అక్కడి ఉద్యోగులు పని భత్యం పెంచారు. ఈ పరిస్థితిలో ఐరోపాకు చెందిన పారిశ్రామికవేత్తలు అమెరికాకు వలస వెళ్లారు. అలా ఐరోపా పారిశ్రామిక వృద్ధి కుంటుపడింది. ఆఫ్రికా, ఆసియా నుంచి వృత్తి నిపుణులను తీసుకుని సంస్థలను కాపాడుకున్నారు.

చైనా అదే దారిలో..
అమెరికా అనుసరించిన విధానాన్ని చైనా అనుసరించడం మొదలు పెట్టింది. చైనీయులు పారిశ్రామిక రంగంలోపాటు విద్య, రాజ్యాధికారం అంశంలోనూ కమ్యూనిస్టు భావజాలం చొప్పించారు. దీంతో ఇప్పుడు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలు పారిశ్రామికంగా దెబ్బతినడం మొదలైంది. ఇదే సమయంలో అగ్ర రాజ్యాలు శరణార్థులను ప్రోత్సహించడం, వారిపై ప్రేమ కరుణ చూపకపోవడంతో పారిశ్రామికంగా దెబ్బతిన్నాయి. స్వార్థ రాజకీయాల కారణంగా ఒకప్పటి పాశ్చాత్య ఆర్థిక దిగ్గజాలు ఇప్పుడు పతనం దిశగా పయనిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version