Top National Parks : ప్రపంచంలోనే టాప్ జాతీయ పార్క్ లివి.. వాటి విశేషాలేంటంటే..

దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్.. పర్యాటకులకు అసలు సిసలైన ఆఫ్రికన్ సఫారీ అనుభవాన్ని అందిస్తుంది. దాదాపు రెండు మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఫారెస్ట్ విస్తరించి ఉంది.

Written By: NARESH, Updated On : May 21, 2024 5:30 pm

Top most beautiful National Parks in the world

Follow us on

Top National Parks : దట్టమైన అడవులు.. అందులో అందమైన సెలయేళ్లు.. క్రూరమైన మృగాలు.. సయ్యాటలాడే పక్షులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రకృతి రమణీయత వర్ణనకు అందదు. అభివృద్ధి వల్ల మనుషులు అడవులను ధ్వంసం చేస్తున్నారు. కానీ, కొన్నిచోట్ల సంరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల కొద్దో, గొప్పో అడవులు మిగిలి ఉన్నాయి. జాతీయ పార్కులుగా రూపాంతరం చెంది, పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమమైన జాతీయ పార్కులేమిటో ఒకసారి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎల్లో స్టోన్, అమెరికా

Yellow Stone usa

ఎల్లో స్టోన్ అనేది అమెరికా మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం. ఇది అమెరికా సహజ సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది వ్యోమింగ్ నుంచి ఇడాహో వరకు విస్తరించి ఉంది. ఈ అడవిలో భూ ఉష్ణ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. బైసన్, ఎలుగుబంట్లు, తోడేళ్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఆల్ఫైన్ పచ్చిక భూములు, లోయలు ఈ పార్క్ కు ప్రధాన ఆకర్షణ.

సెరెంగేటి నేషనల్ పార్క్.. టాంజానియా

సెరెంగేటి నేషనల్ పార్క్.. టాంజానియా

టాంజానియా ప్రాంతంలో ఉన్న సెరేంగేటి నేషనల్ పార్క్ అత్యుత్తమమైన ఆఫ్రికన్ సఫారీ అనుభవాన్ని పర్యాటకులకు అందిస్తుంది. సవన్నా, గడ్డి భూములతో ఈ పార్క్ విస్తరించి ఉంది.. కంచర గాడిదలు, ఆఫ్రికన్ దున్నపోతులకు ఈ ప్రాంతం ఆలవాలం. సింహాలు, చిరుతలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అవి దున్నపోతులను ఎక్కువగా వేటాడుతుంటాయి.. ఈ దృశ్యాలను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు.

బాన్ఫ్ నేషనల్ పార్క్, కెనడా

01-banff-national-park-canada

కెనడాలోని రాకీస్ లో ఉన్న ఈ పార్క్ పర్యాటకులకు స్వర్గధామం లాంటిది. ఇందులో ఉన్న ఎత్తైన శిఖరాలు, సరస్సులు పర్యాటకులకు కొత్త అనుభూతులను కలిగిస్తాయి. ఇందులో ఉన్న విశాలమైన హిమానీనదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

టోర్రెస్ డెల్ ఫైన్ నేషనల్ పార్క్, చిలీ

torres-del-paine-national

టోర్రెస్ డెల్ ఫైన్ నేషనల్ పార్క్ చిలీలో ఉంది.. ఈ ప్రాంతంలో కఠినమైన శిఖరాలు, ఆకాశాన్ని తాకే వృక్షాలు, పురాతన నదులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. దక్షిణ పటగోనియన్ ప్రాంతంలో అద్భుతమైన జీవావరణం ఉంటుంది.. ఇక్కడికి ఎక్కువగా సాహస యాత్రికులు వస్తుంటారు.. పర్వతాలను అధిరోహిస్తుంటారు.

క్రూగర్ నేషనల్ పార్క్, దక్షిణాఫ్రికా

క్రూగర్ నేషనల్ పార్క్, దక్షిణాఫ్రికా

దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్.. పర్యాటకులకు అసలు సిసలైన ఆఫ్రికన్ సఫారీ అనుభవాన్ని అందిస్తుంది. దాదాపు రెండు మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఈ ఫారెస్ట్ విస్తరించి ఉంది. సింహం, ఏనుగు, అడవి గేదె, చిరుత పులి, ఖడ్గమృగం వంటి జంతు శ్రేణికి ఈ పార్క్ ఆలవాలం. సందర్శకులు గేమ్ డ్రైవ్, గైడెడ్ వాక్ చేసేందుకు ఇష్టపడుతుంటారు.