SRH vs KKR: ఐపీఎల్ ప్లే ఆఫ్ కు రంగం సిద్ధమైంది. మరో కీలక సమరానికి అహ్మదాబాద్ వేదికయింది. మంగళవారం నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్ కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైయర్ – 1 లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ లోకి దూసుకెళ్తుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్ -2 మ్యాచ్ ఆడాలి. ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచిన టీం తో పోటీ పడాలి.
ఇప్పటివరకు ఈ రెండు జట్లు 26 సార్లు పరస్పరం తలపడ్డాయి. కోల్ కతా 17 సార్లు, హైదరాబాద్ 9సార్లు విజయాన్ని అందుకున్నాయి. ఈ సీజన్లో లీగ్ దశలో కోల్ కతా, హైదరాబాద్ పోటీపడ్డాయి.. చివరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఈ మ్యాచ్ సాగింది. ఆఖరికి నాలుగు పరుగుల తేడాతో కోల్ కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోల్ కతా బౌలర్ హైదరాబాద్ ఆటగాళ్లను కవ్వించాడు. అతడి వ్యవహార శైలితో మ్యాచ్ కాస్త ఆసక్తికరంగా మారింది.
కోల్ కతా బౌలర్ హర్షిత్ రాణా – మయాంక్ అగర్వాల్ మధ్య ఆ సంఘటన జరిగింది.. దానిని హైదరాబాద్ బౌలర్లు అంత ఈజీగా పక్కన పెట్టలేరు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ శుభారంభాన్ని సాధించింది.. మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ తొలి వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే పవర్ ప్లే చివరి ఓవర్ లో మయాంక్ అగర్వాల్ ను హర్షిత్ రాణా వెనక్కి పంపించాడు..భారీ షాట్ కు యత్నించిన మయాంక్ రింకూ సింగ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు.
మయాంక్ క్యాచ్ అవుట్ కావడంతో హర్షిత్ రాణా ఓవర్ యాక్షన్ చేశాడు. మయాంక్ దగ్గరికి వచ్చి గాల్లో ముద్దు ఇచ్చాడు.. అంతేకాకుండా మైదానం నుంచి వెళ్ళిపో అంటూ బలుపుతో కూడిన సైగలు చేశాడు. చివర్లో క్లాసెన్ వికెట్ తీసిన హర్షిత్.. చిల్లర వ్యవహారాలు చేశాడు. మైదానంలో వెర్రి చేష్టలకు పాల్పడ్డాడు..ఇది హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.. ఈ నేపథ్యంలో ఆ ముద్దుల బౌలర్ సరదా తీర్చాలని హెడ్ ను ఉద్దేశించి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..లీగ్ దశలో షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్ కతా ఓకే ఒక్క మ్యాచ్ ఆడేందుకు అవకాశం ఏర్పడింది. కానీ, ఈ రెండు జట్లు పోటాపోటీగా ఆడి ప్లే ఆఫ్ కు వచ్చాయి. దీంతో ఈ రెండు జట్లు మరోసారి తల పడనున్నాయి. హర్షిత్ రాణా కు గట్టిగా బుద్ధి చెప్పాలని.. సోషల్ మీడియాలో నెటిజన్లు హైదరాబాద్ ఆటగాళ్లను కోరుతున్నారు..కోల్ కతా జట్టు ను ఓడించాలని పిలుపునిస్తున్నారు.
Match day
ila kodthey harshit rana gadi head pagilipovali
pic.twitter.com/Ze7ICrN7kM— OG Reddy (@meowreddy) May 21, 2024