Thwaites Glacier: భారత్ లో కనివిని ఎరగని స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. పాకిస్తాన్ అయితే చిగురుటాకులా వణుకుతోంది. చైనా లో ఆకాశానికి చిల్లు పడిందా అనే స్థాయిలో వర్షం కురుస్తోంది. యూరప్ లో ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు లేక కరువు తాండవిస్తోంది. థేమ్స్ నది చిన్న కుంటను తలపిస్తోంది. ఇన్ని విపత్తులకు కారణం మనిషి చేస్తున్న చేష్టలే. పెరిగిపోతున్న కాలుష్యం, వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ, ఇష్టానుసారంగా చెట్లను కొట్టివేయడం, నది పరివాహక ప్రాంతాల్లో కాలుష్య ఉద్గారాలను విడుదల చేయడం.. ఈ కారణాలతో పర్యావరణ చక్రం గతి తప్పుతోంది. అందుకే అకాల వర్షాలు మంచెత్తుతున్నాయి. కనివిని ఎరుగని స్థాయిలో కరువు కాటకాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సరే ఇవన్నీ పక్కన పెడితే 2020 సినిమాలో చూపించినట్టు జలప్రళయం అంచున ప్రపంచం నిలిచి ఉంది. చదువుతుంటేనే భయం అనిపిస్తుంది కదా. నమ్మినా నమ్మకున్నా.. ఇది నిష్టూరమైన సత్యం.

థ్వాయిట్స్ హిమానీ నదం కరిగిపోతున్నది
థ్వాయిట్స్ హిమానీ నదం.. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలో అత్యంత భారీ మంచు కొండ. ఇది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్.. కొంతకాలంగా వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల శరవేగంగా కరిగిపోతుంది. ఇప్పుడు అది ముని వేళ్ళ పై నిలబడి ఉంది. ఈ ప్రమాదాన్ని గుర్తించే శాస్త్రవేత్తలు థ్వాయిట్స్ కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్ డే గ్లేషియర్) అని పేరు పెట్టారు. ఈ గ్లేషియర్ తో పాటు సమీప ప్రాంతాల్లోని మంచు మొత్తం కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టం ఏకంగా మూడు మీటర్ల ఎత్తు పెరుగుతుంది. తీర ప్రాంతాల్లో చాలావరకు నీట మునుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే 2020 సినిమాలో చూపించినట్టు పరిస్థితులు ఉంటాయి.
థ్వాయిట్స్ హిమానీ నదం పై ఇటీవల అమెరికా, స్వీడన్, యూకే శాస్త్రవేత్తలు సంయుక్తంగా అధ్యయనం చేశారు. గత రెండు శతాబ్దలకంటే ఇటీవల కాలంలో థ్వాయిట్స్ హిమానీ నదం ఎక్కువ కరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నేచర్ జియో సైన్స్ పత్రికలో ప్రచురించారు. రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ప్రతిఏటా 1.3 మేళ్లకు పైగా ( 2.1 కిలోమీటర్లు) కరిగిపోతున్నట్టు తేల్చారు. ఇది ఇలాగే కొనసాగితే సముద్రమట్టం పెరిగి సమీపంలోని ఆవాసాలు పూర్తిగా మునిగిపోతాయి. అరుదైన జీవజాలానికి వాటిల్లుతుంది.
థ్వాయిట్స్ హిమానీ నదం పూర్తి వివరాలు ఇలా
పశ్చిమ అంటార్కిటికాలోని థ్వాయిట్స్ హిమానీ నదం యునైటెడ్ కింగ్డమ్ మొత్తం పరిమాణం కంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం అంత ఉంటుంది. థ్వాయిట్స్ హిమానీ నదం మొత్తం చుట్టుకొలత 74,131 చదరపు మైళ్ళు. గ్రేట్ బ్రిటన్ చుట్టుకొలతతో సమానం. దీని మందం 4000 మీటర్లు. అంటే ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాల పెరుగుదలతో పోల్చితే థ్వాయిట్స్ హిమానీ నదం వాటానే అధికం. థ్వాయిట్స్ హిమానీ నదం మందం 4 కిలోమీటర్లు. ఇందులో రెండు కిలోమీటర్లకు పైగా సముద్ర ఉపరితలం నుంచి ఇదిగో బాగాన ఉంటుంది. థ్వాయిట్స్ హిమానీ నదం కరిగిపోతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర నీటి మట్టం దాదాపు పది అడుగుల మేర పెరుగుతుంది.

ఈ వరదలకు కారణం అదేనా
థ్వాయిట్స్ హిమానీ నదం కరుగుతుండటం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. మేఘాల్లో అధిక సాంద్రత ఉండటంవల్ల కుంభవృష్టి కురిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరెస్టింగ్ కు తీస్తున్నాయి. కేవలం ఈ సంవత్సరం కురిసిన అధిక వర్షాల వల్ల ఆసియా ప్రాంతంలో సుమారు 50 వేల కోట్ల వరకు నష్టం వాటిలినట్టు సమాచారం.