Vijay Devarakonda- Jana Gana Mana: ‘లైగర్’ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోదామని కలలుగన్న విజయ్ దేవరకొండ ఆశలు అడియాశలయ్యాయి. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో విజయ్ తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ‘లైగర్’ సినిమా విడుదకలు ముందే పూరి జగన్నాథ్ తో తన కలల ప్రాజెక్ట్ ‘జనగణమన’ను ప్రారంభించాడు పూరి జగన్నాథ్.. పూరిపై నమ్మకంతో విజయ్ తన రెండో సినిమాను కూడా చేయడానికి ఒప్పుకున్నాడు.

అయితే ‘లైగర్’ ఫలితం ఇప్పుడు విజయ్ దేవరకొండను పునరాలోచనలో పడేలా చేసింది. అందుకే ఒక షెడ్యూల్ పూర్తయినా కూడా విజయ్ ‘జనగణమన’ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.
లైగర్ ఫ్లాప్ కావడం ఇప్పుడు పూరి నెక్ట్స్ ఫిలిం ‘జనగణమన’పై పడింది. దీనిపై దర్శక, నిర్మాతలు ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న పూరి జగన్నాథ్, చార్మీలు సైతం ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. దీంతో ‘జనగణమన’ ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. వీటిని కూడా చిత్రం యూనిట్ ఖండించడం లేదు.

ఈ క్రమంలోనే ‘సైమా’ వేడుకకు హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘జనగణమన’ గురించి కొందరు ప్రశ్నించగా.. ‘ఇక్కడికి ప్రతీ ఒక్కరూ వేడుకను ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కాబట్టి దాని గురించి మర్చిపోండి.. సైమాను ఎంజాయ్ చేయండి’ అంటూ సమాధానమిచ్చాడు. విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
దీన్ని బట్టి ఇక ‘జనగణమన’ సినిమాను విజయ్ ఆపేసినట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేళ్ల క్రితమే ఈ క్రేజీ ప్రాజెక్టును పూరి ప్రకటించారు. మహేష్ బాబు హీరోగా అనౌన్స్ కూడా చేశాడు. కానీ మహేష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ కథతోనే విజయ్ ను పెట్టి ప్రారంభించాడు. మొదటి షెడ్యూల్ కూడా పూర్తయ్యింది. కానీ ‘లైగర్’ ఫ్లాప్ తో విజయ్ తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.