Srimukhi: రంగం ఏదైనా అమ్మాయిలకు లైంగిక వేధింపులు సర్వసాధారణం. ఇక గ్లామర్ ఫీల్డ్ లో మరింత దారుణంగా ఉంటాయి. అవకాశాల ఎరవేస్తూ శారీరకంగా వాడుకోవాలని చూసే మగ మృగాలు అడుగడునా ఉంటాయి. వాటిని దాటుకొని ఓ స్థాయికి రావడం మామూలు విషయం కాదు. కాగా స్టార్ యాంకర్ శ్రీముఖి సైతం ఈ తరహా వేధింపులు ఎదుర్కొన్నారట. కెరీర్ బిగినింగ్ లో ఓ మేల్ యాంకర్ ఆమెను లైంగికంగా వేధించాడట. నైట్ ఈవెంట్స్ పేరుతో ఇబ్బంది పెట్టేవాడట. యాంకర్ గా ఫేమ్ రాక మునుపు శ్రీముఖి చిన్న చిన్న షోస్ చేసేవారు. అప్పుడు ఆమెకు డిమాండ్ లేదు. ఈ క్రమంలో స్టార్ యాంకర్ ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడట.

ఈవెంట్ ఉంది నైట్ కి వస్తే బాగా డబ్బులు వస్తాయి. మంచి ఆఫర్ వస్తావా అంటూ ఇబ్బంది పెట్టేవాడట. శ్రీముఖి రానని చెప్పినా వినకుండా పదే పదే కాల్స్ చేసేవాడట. అతడి మాటల వెనకున్న దురుద్దేశం అర్థం చేసుకొని శ్రీముఖి అతనితో నైట్ ఈవెంట్స్ కి వెళ్లేవారు కాదట. అతడు మానసికంగా టార్చర్ పెట్టాడట. ఓ స్థాయికి వెళ్ళాక శ్రీముఖి ఇలాంటి ఇబ్బందుల నుండి బయటపడ్డారట. పటాస్ షోతో శ్రీముఖి పాపులర్ అయ్యారు. యాంకర్ రవితో పాటు ఆమె పటాస్ షో చేశారు. స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన పటాస్ పర్వాలేదు అనిపించుకుంది.
తనదైన కామెడీ, యాంకరింగ్ తో శ్రీముఖి ఆడియన్స్ లో పాపులారిటీ తెచ్చుకున్నారు. బుల్లితెర రాములమ్మగా ఫేమస్ అయిన శ్రీముఖి ప్రస్తుతం టాప్ యాంకర్స్ లో ఒకరు. చేతినిండా ఆఫర్స్ తో దూసుకుపోతున్నారు. షోకి లక్షల్లో తీసుకునే స్థాయికి ఎదిగారు. అనసూయ, రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్స్ లో మూడో స్థానంలో ఉన్నారు. పరిశ్రమలో మంచి మనిషిగా కూడా ఆమెకు పేరుంది. తోటి యాంకర్స్, కమెడియన్స్ ని ఆమె ఆర్థికంగా కూడా ఆదుకున్నారట.

మరోవైపు నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె సోలో హీరోయిన్ గా కూడా మారారు. క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి గ్లామరస్ రోల్ చేశారు. అలాగే స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. శ్రీముఖి నటించిన ఇట్స్ టైం టు పార్టీ మూవీ ఇటీవల విడుదలైంది. సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న శ్రీముఖి కొన్ని బిజినెస్ లు కూడా చేస్తున్నారు.