Powerful Passports: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే… భారతదేశ స్థానం ఎంతో తెలుసా?

పాస్‌పోర్టు.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలేందుకు ప్రభుత్వాలు జారీ చేసే గుర్తింపు పత్రం. ఇది ఉంటేనే ప్రపచంలోని దేశాలు కూడా అనుమతి ఇస్తాయి. అయితే ఇటీవల కొన్ని దేశాలు పర్యాటక అభివృద్ధి కోసం పాస్‌పోర్టు లేకున్నా అనుమతి ఇస్తున్నాయి.

Written By: Raj Shekar, Updated On : July 25, 2024 10:14 am

Powerful Passports

Follow us on

Powerful Passports: ప్రపచంలో ప్రతీ దేశం ఆ దేశ పౌరులు కోరుకుంటే పాస్‌పోర్టు జారీ చేస్తుంది. ఇది ఏ దేశ పౌరుడై మరొక దేశానికి వెళ్లాలంటే తప్పనిసరి. పాస్‌పోర్టు అనేది దేశ పౌరుడిగా ఇచ్చే గుర్తింపు పత్రం. ఈ పాస్‌పోర్ట్‌ తోనే ఆ వ్యక్తి ఎవరు? ఏ దేశానికి చెందినవాడు, ఎక్కడ నుంచి వచ్చాడు? తదితర విషయాలు తెలుసుకోవటానికి వీలుపడుతుంది. కరోనా ముందు వరకు వీసా ఆధారంగానే చాలా దేశాలు అనుమతి ఇచ్చేవి. అయితే కరోనాతో పర్యాటకరంగం బాగా దెబ్బతిన్నది. దీంతో కోవిడ్‌ తర్వాత చాలా దేశాలు పర్యాటకరంగం కోలుకోవడానికి వీసా నిబంధనలను సడలించాయి. వీసా లేకపోయినా విమానం టికెట్‌ కొనుక్కొని వస్తే వెల్‌కమ్‌ చెబుతున్నాయి. ఇలాంటి దేశాల్లో సింగపూర్, థాయ్‌లాండ్, మాల్దీవులు తదితర దేశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో జారీ చేసే వీసాలు కూడా రకాలు ఉన్నాయి. కొన్ని పాస్‌పోర్ట్‌లు వ్యక్తుల స్టేటస్‌ను తెలియజేస్తాయి. అంతేకాకుండా సాధారణ పాస్‌పోర్ట్‌ హోల్డర్ల కంటే కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినవి. ఈ పాస్‌పోర్ట్‌లలో కొన్ని తమ హోల్డర్‌లకు వీసా రహిత ప్రయాణం, వేగవంతమైన ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ కలిగి ఉంటాయి. సెక్యూరిటీ చెకింగ్‌ ఉండదు. ఇక ఇండియాలో పాస్‌పోర్ట్‌ జారీలకు సంబంధించిన ప్రక్రియలన్నీ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు అనుంబంధంగా పనిచేసే వీసా, పాస్‌ పోర్ట్‌ కౌన్సిలర్‌ డివిజన్‌ పర్యవేక్షిస్తుంది. 1967 పాస్‌పోర్ట్‌ చట్టం ప్రకారంగా వీటిని జారీచేస్తారు. ఇండియన్‌ పాస్‌పోర్టు పొందేందుకు దేశవ్యాప్తంగా 93 ప్రాంతీయ పాస్‌పోర్టు కేంద్రాలు ఉన్నాయి. వాటికి అనుబంధంగా సహాయక కేంద్రాలు, ప్రపంచ వ్యాప్తంగా 160కు పైగా డిప్లోమాటిక్‌ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఇండియాలో మూడు రకాల పాస్‌పోరుట్లు జారీ చేస్తున్నారు.

Also Read: చందమామపై నీటి జాడలు.. గుర్తించిన చైనా.. అన్నీ అనుకూలిస్తే త్వరలోనే జాబిల్లి టూర్‌

శక్తివంతమైన పాస్ట్‌ పోర్టు ఉన్న దేశాలు..
ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల జాబితాను హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఇందులో గతంలో పోలిస్తే భారత్‌ ర్యాంకు మూడుస్థానాలు మెరుగుపడింది. ఈ జాబితాలో మన పాస్‌పోర్టు ర్యాంకు 82. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ 85వ స్థానంలో ఉంది. సెనెగెల్, తజకిస్థాన్‌ దేశాల పాస్‌పోర్టులు కూడా 85వ స్థానంలో ఉన్నాయి.

58 దేశాలకు వీసా లేకుండా..
ఇదిలా ఉంటే.. మన పాస్‌పోర్టుతో ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ వంటి 58 దేశాలక వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. గతంలో ఈ సంఖ్య 59 ఉండేది. ఇప్పుడు ఒక దేశం తగ్గింది. ఇక ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్‌ అగ్రస్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చని నివేదిక తెలిపింది.

శక్తివంతమైన వీసాలు ఇలా..
ఇక శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో సింగపూర్‌ మొదటి స్థానంలో ఉండగా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్‌ వీసాలు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ దేశా పాస్‌పోర్టు ఉన్నవారు 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఆ తర్వాత ఆప్ట్రియా, ఫిన్‌లాండ్, ఐర్లాండ్‌ పాస్‌పోర్టులు ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోరుట్తో 191 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక అగ్రరాజ్యం అమెరికా పాస్‌పోర్టు ర్యాంకులో 8వ స్థానంలో ఉంది. యూఎస్‌ పాస్‌పోర్టు ఉన్నవారు 186 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక మన దాయాది దేశం పాకిస్తాన్‌ పాస్‌పోర్టు ర్యాంకు 100. ఆదేశ పాస్‌పోర్టుతో 33 దేశాలకు వెళ్లొచ్చు. ఇక జాబితాలో అట్టడుగున 103వ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్‌ ఉంది. ఆ దేశ పాస్‌పోర్టుతో వీసా లేకుండా కేవలం 26 దేశాలకు మాత్రమే వెళ్లొచ్చు

Also Read: రూట్‌ మార్చిన ఫేస్‌బుక్‌.. మళ్లీ ట్రంప్‌ భజన.. జూకర్‌బర్గ్‌ ఏంటయ్యా ఇదీ…