https://oktelugu.com/

Mark Zuckerberg  : రూట్‌ మార్చిన ఫేస్‌బుక్‌.. మళ్లీ ట్రంప్‌ భజన.. జూకర్‌బర్గ్‌ ఏంటయ్యా ఇదీ…

మీడియా అయినా.. సోషల్‌ మీడియా అయినా.. తమ బాధ్యతలు తాము నిర్వర్తించినంత వరకు ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, తమను తాము దిగజార్చుకుని అవసరం ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తుకుని.. అవసరం లేనప్పుడు అధఃపాతాళానికి దించిచడమే పొరపాటు.. ఇప్పుడు మెటా సంస్థ సీఈవో ఇప్పుడు అదే చేస్తున్నారు

Written By:
  • Raj Shekar
  • , Updated On : July 24, 2024 8:05 pm
    Follow us on

    Mark Zuckerberg   : మెటా సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌.. ఫేస్‌బుక్, వాట్సాస్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌పాంతో ప్రపంచాన్నే శాసిస్తున్నారు. రాజకీయాలను, వ్యాపారాలను ఇన్లూ్ఫయెన్స్‌ చేస్తున్నారు. ఇక ఈ సోషల్‌ మీడియా యాప్స్‌తో ప్రపపంచ వ్యాప్తంగా అన్నివర్గాలను ఎడిక్ట్‌ చేసుకున్నారు. దీంతో తాము ఏం చేసినా చెల్లుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు యాప్స్‌లో మార్పులు చేస్తూ.. ఖాతాదారులను ఆకట్టుకునే ప్రనయత్నం చేస్తున మెటా.. వీటిద్వారా బాగానే ఆదాయం పొందుతోంది. అయినా జూకర్‌బర్గ్‌ లోకల్‌ మీడియా తరహాలో వ్యవహరించడం అందరినీ విస్మయారికి గురిచేస్తోంది. 2020లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై విమర్శలు చేశారు. వ్యక్తిగత ధూషణలకు దిగారు. ఈమేరకు సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి ట్రంప్‌ ఓటమిలో కీలకపాత్ర పోషించారు. తన స్థాయిని దిగజార్చుని మరీ ట్రంప్‌ ఓటమికి కృషి చేశారు. ఇదంతా కావాలనే చేశారు. ట్రంప్‌ ఓటమి కోసం ఒక ఫార్ములా ప్రకారం పనిచేశారు. ట్రంప్‌ సామాజిక విధ్వంసకారి అని కూడా ప్రచారం చేశారు. అదే సమయంలో ట్రంప్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఆయనపై అమెరికన్లలో వ్యతిరేకత పెంచాయి. దీంతో ఎన్నికల్లో ట్రంప్‌ ఓటమికి కారణమయ్యాయి. డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ను గెలిపించారు. బైడెన్‌ కూడా ప్రజల ఆకాంక్ష మేరకు నాలుగేళ్లు పాలన సాగించారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ ట్రంప్‌ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థల అక్కడ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎవరు అధ్యక్షుడో అంచనా వేస్తున్నాయి.

    ట్రంప్‌కు పెరుగుతున్న మద్దతు..
    ఇదిలా ఉంటే.. ఇప్పుడు అమెరికాలో నిర్వహిస్తున్న సర్వేల్లో ట్రంప్‌ ముందంజలో ఉన్నారు. మొన్నటి వరకు ౖ»ñ డెన్, ట్రంప్‌ మధ్య హోరాహోరీ పోరు సాగింది. కానీ ఇప్పుడు ట్రంప్‌ వైపే మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు పలు సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెటా సీఈవో జూకర్‌బర్డ్‌ కూడా తన స్టాండ్‌ మార్చుకున్నారు. మళ్లీ ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తుకుంటున్నారు. నాడు ప్రజాస్వామ్య విధ్వంసవాదిగా పేర్కొన్న ఫేస్‌బుక్‌ ఇప్పుడు ప్రజాస్వామ్యవాదిగా కీర్తిస్తోంది. ట్రంప్‌కు అనుకూలంగా తన సోషల్‌ మీడియా యాప్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనిని గమనించిన అమెరికన్లు జూకర్‌బర్గ్‌ తీరుపై విమర్శలు చేస్తున్నారు.

    ట్రంప్‌ ధైర్యానికి ప్రశంస..
    ఇదిలా ఉంటే.. డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇటీవల చోటుచేసుకున్న హత్యాయత్నం ఘటన యావత్‌ ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. పెన్సిల్వేనియాలోని ప్రచార ర్యాలీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ట్రంప్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మెటా సీఈవో ] ూర్క్‌ జూకర్‌బర్గ్‌ స్పందించారు. మాజీ అధ్యక్షుడి ధైర్యాన్ని ప్రశంసించారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టంచేశారు. ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నా జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యం అది. ఆ సమయంలో ఆయన చూపిన తెగువ చాలా స్ఫూర్తి కలిగించింది. ఒక అమెరికన్‌ ఎవరైనా ఆ పోరాటంతో భావోద్వేగానికి గురి కావాల్సిందే. అందుకేనేమో చాలామంది ఆయనను ఇష్టపడతారు’ అనిట్రంప్‌ను ప్రశంసించారు. అయితే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, రాజకీయాలతో దీనికి ఎలాంటి సంబంధం లేదని మెటా సీఈవో స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి తాను మద్దతు ఇస్తున్నారో చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉండగా, ఇటీవల ట్రంప్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే టిక్‌టాక్‌ను నిషేధించనని, అలా చేస్తే మెటా ప్రయోజనం పొందుతుందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల వేళ జూకర్‌బర్గ్‌ ట్రంప్‌ను ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    2021లో నిషేధం.
    కాగా, 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి తర్వాత మెటా సీఈవో జూకర్‌బర్గ్‌ ట్రంప్‌ ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను నిషేధించారు. దీంతో ట్రంప్‌ సొంతంగా సోషల్‌ మీడియా యాప్‌ ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 2023లో మెటా సీఈవో ట్రంప్‌ ఖాతాలను పునరుద్ధరించారు. అయితే భవిష్యత్తులో ట్రంప్‌ మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధిస్తామని పేర్కొంది. అయితే, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయన ఖాతాలపై ఆంక్షలను మెటా ఎత్తివేసింది.