https://oktelugu.com/

Sai Dharam Tej: ఆ హీరోయిన్ తో సాయిధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్.. మెగా ఇంట్లో మరో పెళ్లి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!

హీరోయిన్ మెహ్రీన్ తో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్. మెగా ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయని న్యూస్ వినిపిస్తుంది. ఈ వార్తలపై సాయి ధరమ్ తేజ్ టీమ్ స్పందించారు. పెళ్లిపై స్పష్టత ఇచ్చారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 25, 2024 / 08:37 AM IST

    Sai Dharam Tej

    Follow us on

    Sai Dharam Tej: మెగా హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. వరుస హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలో టైర్ టూ హీరోల జాబితాలో చేరాడు. సాయి ధరమ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, ప్రతిరోజూ పండగే మంచి విజయాలు అందుకున్నాయి. అయితే బైక్ ఆక్సిడెంట్ కారణంగా కొంత కాలం సినిమాలకు దూరంగా అయ్యాడు. గత ఏడాది ‘ విరూపాక్ష ‘ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ‘ బ్రో ‘ సినిమా చేశాడు. కానీ ఈ మూవీ ఆశించినంతగా ఆడలేదు.

    Also Read: పుష్ప 2 లో క్యామియో రోల్స్ ప్లే చేస్తున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?

    ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఓ భారీ బడ్జెట్ మూవీకి సైన్ చేశాడు. హనుమాన్ మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం . ఇది ఇలా ఉంటే .. మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మొగనున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరిద్దరూ రెండు సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డారు.

    ఆ ప్రేమను వరుణ్ తేజ్ పెళ్లి వరకు తీసుకు వచ్చాడు. ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ మెహ్రీన్ తో సాయి ధరమ్ తేజ్ ప్రేమలో ఉన్నాడని వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు త్వరలో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్. మెగా ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయని న్యూస్ వినిపిస్తుంది. మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీగా ఉండటంతో ముహూర్తాలు వాయిదా వేశారట.

    అయితే ఈ విధంగా వస్తున్న రూమర్స్ పై మెగా పి ఆర్ టీం స్పందించింది. ఈ పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. సాయి ధరమ్ తేజ్ పెళ్లి వార్తలు అన్నీ అబద్దాలే. హీరోయిన్ తో వస్తున్న ఈ రూమర్స్ లో వాస్తవం లేదు. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే మేము అఫీషియల్ అనౌన్స్ చేస్తాం. ఇలాంటి అబద్దాలను ప్రచారం చేయకండి అని టీమ్ క్లారిటీ ఇచ్చింది.

    వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠితో ప్రేమ, పెళ్లి వార్తలు ఇలానే ఖండించారు. సడన్ గా నిశ్చితార్థం ప్రకటించి షాక్ ఇచ్చాడు. మరి సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ సైతం అలానే మొదట ఖండించి తర్వాత… శుభవార్త చెబుతారేమో చూడాలి. కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది మెహ్రీన్. నాని హీరోగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఆ చిత్రం సూపర్ హిట్ అందుకుంది.

    అనంతరం మెహ్రీన్ కి ఆఫర్స్ వెల్లువెత్తాయి. అయితే విజయాలకంటే ఆమె కెరీర్లో అపజయాలే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం మెహ్రీన్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. కాగా మెహ్రీన్ 2021లో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం చేసుకుంది. కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కారణం తెలియదు కానీ ఈ వివాహం రద్దు అయ్యింది. మెహ్రీన్ మరలా పెళ్లి మాట ఎత్తలేదు. ఇక చేతిలో సినిమాలు లేకున్నా మెహ్రీన్ సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది.

    Also Read:  జాన్వీ కపూర్ మీద కామెంట్లు చేసిన స్టార్ యాక్టర్…ఫైనల్ గా ఏం జరిగింది..?